పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/241

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌నశీర్‌అహమ్మద్‌


పదమూడు సంవత్సరాల వయస్సులోనే ఆమె ' నిగార్‌ ' పత్రికను చదవటం ఆరంభించారు. లక్నొకు చెందిన నియాజ్‌ ఫతేపూరి సంపాదకత్వంలో నిగార్‌ పత్రిక వచ్చేది. ఆ పత్రిక, ఛందసత్వానికి, మతమౌడ్యానికి, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడటమే కాకుండ స్వాతంత్య్రం, సామ్రాజ్యవాద వ్యతిరేక లక్ష్యాన్ని ముందుకు తీసుక పోవడానికి కృషిచేసింది. అందువల్ల యీ పత్రిక అత్యంత ప్రమాదకరమైనదని నైజాం ప్రబుత్వం భావించి హైదరాబాదు సంస్థానంలోకి దాని ప్రవేశాన్ని నిషేధించింది. (హెదరా బాఫదు సంస్థానంలో రాజకీయ చైతన్యం, విద్యార్థి-యువజనుల పాత్ర (1938-1956), ఎస్‌.ఎం.జవాద్‌ రజ్వీ విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్‌, విజయవాడ, 1985, పేజి.25).

నిషేదిత నిగార్‌ పత్రిక ప్రబావం వలన మతపరమైన ఛాందసాలకు వ్యతిరేకంగా, బ్రిటిషర్ల మిత్రుడిగా మారిన నైజాం సంస్థానాధీశుడ్ని నిరశిస్తూ జమాలున్నీసా ఉద్యమించారు. ఆమె అభిప్రాయాల స్థిరత్వానికి కుటుంబ వాతావరణం కూడ తొడ్పడింది. మత సంబంధమైన కొన్ని ఆచార సంప్రదాయాల విషయంలో కూడ సమకాలీన సమాజం అభిప్రాయాలకు భిన్నంగా ప్రవర్తించటం వలన జమాలున్నీసా స్వజనుల నుండి చాలా ఇక్కట్లను ఎదుర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ, మమ్మల్ని కాఫిర్లనేవాళ్ళు. మతద్రోహులని పిలిచేవాళ్ళని జమాలున్నీసా స్వయంగా చెప్పుకున్నారు. ఈ మేరకు స్వతంత్ర భావాలతో ఉద్యమిస్తున్న ఆ కుటుంబ సభ్యుల పదతు లు సరికాదంటూ బందువులు ఎంతగా చెప్పినా ఆ కుటుంబ సభ్యులు తమదైన మార్గంలో ముందుకు సాగారు. తొలిదశలోబ్రిటిషర్లకు వ్యతిరేకంగా జాతీయోద్యమం పట్ల మొగ్గు చూపిన జమాలున్నీసా చివరివరకు ఆ పోరుబాటన నడవటమే కాకుండ కమ్యూనిస్టుగా తన పోరాట పరిధిని మరింతగా విస్త్రృత పర్చుకున్నారు.

స్వతంత్ర ఆలోచనలు, ఉదార స్వభావం గల కుటుంబంలో జన్మించి, ఆ వాతావరణంలో ఎదిగిన జమాలున్నీసా వివాహం సంకుచిత ఆలోచనలు గల కుటుంబంలో జరిగింది. ఆ కారణంగా అత్తవారింటి వాతావరణంతో అలవాటు పడేందుకు తొలిదశలో ఆమె చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ విషయాన్ని ఆమె వివరిస్తూ మా అత్తవారిల్లు చాలా వెనుకబడ్డ కుటుంబం. మొదట్లోచాలా బాధవేసేది. కష్టంగా అనిపించేది. నేను కొంత సరిపుచ్చుకోవాల్సి వచ్చేది...నన్ను ఒక సంవత్సరం దాకా మా వాళ్ళు మా అమ్మ

238