పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/227

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌నశీర్‌అహమ్మద్‌

ఆ శక్తుల పరాజయాన్ని ఆమె ఆశించారు. అందుకు అవసరమగు నిధులను అందించేందుకు ఆమె ముందుకు వచ్చారు.

ఆనాటికి డాక్టర్ అన్సారి అపార ఆస్తిపస్తులు జాతీయోద్యమ కార్యక్రమాల కోసం కరిగి పోయాయి. స్వాతంత్య్ర సమరయోధులకు, కార్మిక ప్రముఖులకు, దేశ, విదేశీ ప్రముఖులకు ఎంతో గౌరవాభిమానాలతో అతిధ్యమిచ్చి, జాతీయోద్యమంలో నాయకుల చారిత్రక చర్ లకు, సంచలన నిర్ణయాలకు వేదికగా నిలిచిన DAR-US-SALAM భవంతి తప్ప మరోక విలువైన అస్తి ఆమెకు కన్పించలేదు. ఆ సమయంలో జాతి ప్రయోజనాల కోసం ఎంత త్యాగానికైనా సిద్ధమని ఆమె, ఆమె భర్త ష్ధకత్‌ అన్సారి ప్రకిటించారు. ఆ ప్రకటనకు తగ్గట్టుగా DAR-US-SALAM భవంతిని, ఆ భవనం చుట్టూ ఉన్న సువిశాలమెన ఆవరణను అమ్మేశారు. ఆ విధగా DAR-US-SALAM ను విక్రయించగా లభించిన సొమ్మును జాతీయ కాంగ్రెస్‌ నాయకుల ఎన్నికల ప్రచారం కోసం జోహరా అన్సారి దంపతులు వ్యయం చేశారు. రాజప్రసాదాన్ని మించిన DAR-US-SALAM భవంతిని విక్రయించాక జోహరా అన్సారి దంపతులు మరొక చిన్న గృహంలోకి మారి అతి సాదాసీదా జీవితం గడిపారు.

భారతదేశం స్వతంత్ర దేశంగా అవతరించాక ఇతర నాయకుల వారసుల్లా ఆమెగాని ఆమె భర్తగాని ప్రభుత్వంలో ఎటువంటి పదవులను స్వీకరించలేదు. లక్షలాది రూపాయల ఆస్తిని జాతీయ కాంగ్రెస్‌ కార్యక్రమాలకు వినియోగించి అతి సామాన్య గృహిణిగా జీవితం గడిపిన జోహరా తమ ఆర్థ్ధిక పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నా చెయ్యిచాచి ఎవ్వరిని సహాయం అడగలేదు. ప్రభుత్వం సహాకారం ఆశించలేదు.

స్వాతంత్య్రోద్యమం కోసం, ప్రజల ప్రయోజనాల కోసం, మత సామరస్యం కాపాడేందుకు, ప్రజలలో పరస్పరం సద్భావనలను పరిపుషం చేసేందుకు తమ జీవితాలు, ఆస్థిపాస్తులు కొంతవరకైనా ఉపయోగపడినందుకు సంతోషిస్తూ ఆమె కాలం గడిపారు. చివరకు 1988 లై 28న ఇంగ్లాండ్‌లో దానగుణసంపన్నురాలు శ్రీమతి బేగం జొహరా అన్సారి అంతిమ శ్వాస విడిచారు.

224