పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/226

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారత స్వాతంత్రోద్యమం:ముస్లిం మహిళలు


జాతీయోద్యమంలో భాగంగా జైలుకెళ్ళేందుకు జోహరా అన్సారి ఉవ్విళారారు. బ్రిటిషు బానిస బంధానాల నుండి దేశాన్ని విముక్తం చేయటంలో భాగంగా జైలుకు వెళ్ళడం ఎంతో గౌరవమని ఆమె భావించారు. ఈ విషయ మై గాంధీజీ అనుమతి కోరుతూ ఆయనకు ఆమె పలు ఉత్తరాలు రాశారు. ఆ ఉత్తరాలకు సమాధానంగా, ఆమె ఆరోగ్యం దృష్ట్యా కొంత సహనం వహించు. నీవు జైలుకు వెళ్ళేందుకు ఒక రోజున నేను తప్పకుండ అనుమతిస్తా, అని 1941 న్‌ 19నాి లేఖలో గాంధీజీ ఆమెకు నచ్చచెప్పారు.

చిన్నతనంలో తల్లితోపాటుగా జాతీయ కాంగ్రెస్‌ సమావేశాలు ఎక్కడ జరిగినా అక్కడకు తాను హాజరయ్యేదానినని ఆమె స్వయంగా చెప్పుకున్నారు. ఆ సమయంలో సేవాదళం కార్యకర్తలు నిర్వహించే పనులలో తాను భాగం పంచుకునేదానినని బేగం జొహరా పేర్కొన్నారు.స్వాతంత్య్ర సమరయోధాులైన తల్లిదండ్రుల వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న జోహరా అన్సారి జాతీయ కాంగ్రెస్‌ పిలుపు మేరకు జరిగిన ప్రతి కార్యక్రమంలో పాల్గొన్నారు.

జాతీయోద్యామ నేతలు, ప్రధానంగా గాంధీజీ ఆమెకు అప్పగించిన ప్రతి పనిని ఎంతో సమర్థ్ధవంతంగా నిరfiహించి ప్రశంసలందుకున్నారు. భారతదేశం నుండి బ్రిీష్‌ పాలకులను పూర్తిగా తరిమివేసి సంపూర్ణస్వరాజ్యాన్ని సాధించుకోవాలంటే, భారతీయ జన సముదాయాలలో ఐక్యతావశ్యకతను అమె గ్రహంచారు. ఆ కారణంగా ఆమె హిందాూ - ముస్లింల ఐక్యతను ప్రగాఢంగా వాంఛించారు. మతం పేరుతో ఆనాడు సాగిన వేర్పాటువాద ధోరణులను తీవ్రంగా నిరసించారు. మత సామరస్యాన్ని కాపాడాలని, మత విద్వేషం కూడదాని, మతాన్ని రాజకీయాలతో ముడి పెట్టరాదని ఆమె విస్తృతంగా ప్రచారం చేశారు.

బేగం జొహరా అన్సారి దానగుణంలో తన తలిదడ్రులకు ఏమాత్రం తీసిపోకుండ వ్యవహరించారు. ఆమె తన కుటుంబానికి చెందిన ఆస్తిపాస్తులను జాతీయ ప్రయాజనాల కోసం త్యాగం చేయడనికి వెనుకాడలేదు. జాతీయోద్యమంలో పాల్గొన్న యోధుల కుటుంబాలను ఆమె ఆర్థికంగా ఆదుకున్నారు. 1946లో జరిగిన ఎన్నికల సందర్భంగా అఖిలభారత ముస్లింలీగ్‌ నాయకులు సాగిస్తున్న వేర్పాటువాద రాజకీయాలను ఎదుర్కొనడనికి నిధులు అవసరమని ఆమె తలచారు. ఐక్యతను చెడగొట్టి, ప్రజలలో విభజనకు కారణమవుతున్న విద్వేష, విభజన రాజకీయాలను ఆమె సహంచలేకపోయారు.


223