పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/228

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మాతృదేశ సేవలో సర్వస్వం త్యాగం చేసిన

ముహమ్మద్‌ గౌస్ ఖాతూన్‌

(-1990)

స్వాతంత్య్రోద్యమంలో ప్రత్యక్ష, పరోక్ష కార్యాచరణ కలిసికట్టుగా సాగుతుంది. ప్రత్యక్ష కార్యక్రమాలలో ధైర్యసాహసాలు ప్రధానం కాగా, పరోక్ష కార్యకలాపాలకు సమర్పణ, సహనం, ఓర్పు, త్యాగాలు ప్రాణం. పరోక్ష కార్యాచరణలో భాగంగా త్యాగాల బాటలో నడిచిన మహిళ శ్రీమతి ఖాతూన్‌ బీబీ.

ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధాుడు ముహమ్మద్‌ గౌస్‌ బేగ్‌ జీవిత సహచరిణి ఖాతూన్‌ బీబీ. భారత స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలో ప్రత్యేకస్థానం పొందటమేకాక, మహాత్ముని అభినందనలు అందుకున్న చీరాల-పేరాల పోరాటం, పెదానందిపాడు పన్నుల నిరాకరణ ఉద్యామంలో ముహమ్మద్‌ గౌస్‌ బేగ్‌ పాల్గొన్నారు. ఖాతూన్‌ బీబీ మాత్రం ప్రత్యకంగా జాతీయోద్యామ కార్యక్రమాలలో పాల్గొనలేదు. పరోక్షంగా జాతీయోద్యమానికి సర్వసం త్యాగం చేశారు. భర్తకు అన్ని విధాల అండదాండలుగా నిలవటమే కాక, జాతీయోద్యమ నేతలు భోగరాజు పట్టాభి సీతారామయ్య, దుర్గాబాయమ్మ, టంగుటూరి ప్రకాశం పంతులు లాంటి ప్రముఖులకు తన ఇంట ఆతిధ్యం కల్పించారు. జాతీయ కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తల పట్ల ఖాతూన్‌ ఎంతో ఆదరణ, ఆప్యాయతలు చూపారు. ఆమె ఇల్లు ఉద్యామకారులకు స్వంత గృహం లాగుండేది.

225