పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/225

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌నశీర్‌అహమ్మద్‌


చిన్ననాటినుండే జాతీయోద్యమం పట్ల అవగాహన, ప్రముఖ నేతలతో సన్నిహిత పరిచయాలను పెంచుకున్నారు. చిన్నతనంలోనే తల్లితండ్రుల్లా తాను కూడ స్వరాజ్యం కోసం బ్రిటీష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని నిరయించుకున్నారు. ఆ నిర్ణయాలకు తగ్గట్టుగానే 1926లో జాతీయోద్యమంలో ఉత్సాహంగా పాల్గొంటున్న యువకులు ష్ధకతుల్లాను ఆమె వివాహం చేసుకున్నారు. అప్పటినుండి ఆ యువ దంపతులు తమ కార్యక్షేత్రాన్ని మరింత విస్తరింపచేసుకుని జాతీయోద్యమంలో అమితోత్సాహంతో పాల్గొన్నారు.

ఆదునిక ఆంగ్ల విద్యావంతురాలైన జొహరా బేగం సాంప్రదాయ విద్యను శ్రద్ధతో అభ్యసించారు. ఆమెకు ఉర్దూ, పర్షియన్‌, ఆంగ్లం, హిందీ, అరబిక్‌ భాషలు బాగా వచ్చు. చరిత్ర-సామాజిక శాస్త్రాలపట్ల ఆమె అధిక శ్రద్ధచూపారని Inside India గ్రంథంలో రచయిత్రి Halide Edib పేర్కొన్నారు. ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని విశాల దృక్పథాన్ని సంతరించుకున్న ఆమె సాంప్రదాయ ఆచార వ్యవహారాలను పాించటంలో తగినంత శ్రద్ధా వహించారు. జాతీయోద్యామ మార్గంలో ఆ ఆచార సాంప్రదాయాలు ఆమెకు ఏవిధాంగా ఆటంకం కానివ్వకుండ, మరెవ్వరికీ బాధాకరం కాకుండ జొహరా బేగం వ్యవహరించారు.

మహాత్మాగాంధీచే బేటి అని ప్రేమతో పిలిపించుకున్న బేగం జొహరా అన్సారి వార్ధా ఆశ్రమంలో గాంధీజీ వద్దా చాలా కాలం గడిపారు. ఆశ్రమంలో ఆమె గాంధీజీకి చేదోడువాదోడుగా వ్యవహరించి, ఆయన మన్నన పొందినట్టు, గాంధీజీ రాసిన లేఖల ద్వారా తెలుస్తుంది. వార్దా ఆశ్రమంలోని వంటగదిలో ఆమె బేగం అముత్సలాంకు సహకరించేదని గాంధీజీ పేర్కొన్నారు. ఉర్దూ భాషను నేర్పందుకు జొహరాను తన గురువుగా వ్యవహరించమని గాంధీజీ స్వయంగా కోరటం విశేషం. ఆమె గాంధీజీకి చక్కని ఉర్దూ నేర్పారు. గాంధీజీ నేర్చుకున్న ఉరూబాషా పరిజ్ఞానాన్ని మరింత పెంచుకోడనికి జొహరా బేగం రాసిన లేఖలు ఎంతో తోడ్పడ్డాయి. ఆశ్రమం నుండి వెళ్ళిపోయాక కూడ ప్రతి వారం గాంధీజీకి ఉత్తరం రాయటం ఆమె అలవాటు. ఆ లేఖలు ఉర్దూ భాషాభివృద్ధికి అవసరమగు సలహాలతో నిండి ఉండేవి. ఈ లేఖలను ప్రస్తావిస్తూ, ఆమె లేఖలు నా ఉర్దూ భాషాభివృద్ధికి ఎంతగానో తోడ్పడ్డాయి...ప్రతివారం వచ్చే ఆమె లేఖల కోసం నేను ఎదురు చూసేవాడ్ని అని మహాత్ముడు పలుసార్లు పేర్కొనటం విశేషం.

222