పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/222

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారత స్వాతంత్రోద్యమం:ముస్లిం మహిళలు

దేశాలను పర్యించారు. మక్కా మదీనాలను సందర్శించారు.1957లో యునెస్కో సమావేశంలో భారత ప్రతినిధిగా పాల్గొని మాట్లాడారు. 1958లో ఆమెను National Committe on Women's Education సభ్యురాలుగా ప్రభుత్వం నియమించింది. ఈ విధాంగా అటు మహారాష్ట్ర ప్రభుత్వం, ఇతర పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఇటు భారత ప్రభుత్వం ఆమెకు ప్రజాసేవా, వయోజన విద్యా, మహిళా సంక్షేమానికి సంబంధించిన పలు ప్రభుత్వ, ప్రభుత్వేతర కమిీలలో స్థానం కల్పించి ఆయా రంగాలలో ఆమెకున్న అపార అనుభవాన్ని వినియోగించుకున్నాయి.

సుమారు ఏడు దాశాబ్దాలపాటు ప్రజాసేవలో గడిన కుల్సుం సయాని మంచి రచయిత్రిగా కూడ ఖ్యాతి గడించారు. జాతీయోద్యాలో, వయోజన విద్యావ్యాప్తిలో భాగస్వామిగా మహిళల్లో చైతన్యం కోసం నిరంతరం కృషి సల్పిన ఉద్యామకారిణిగా తన అనుభవాలను, ఆకాంక్షలను, సూచనలను పొందుపర్చుతూ పలు గ్రంథాలను రాశారు. వయోజన విద్యా వ్యాప్తి కార్యక్రమాలు, స్వాతంత్య్రోద్యాలో మహిళల పాత్ర, సమాజసేవ, భారత్‌-పాకిస్థాన్‌ల మైత్రి, తదితర అంశాలను స్పృశిస్తూ, ఫ్రౌడశిక్షా మేరే అనుభవ్‌, భారత్‌-పాక్‌ మైత్రి మేరే ప్రయత్న్‌, భారతీయ స్వతంత్ర సంగ్రాం మేౌ మహిళావోం కీ భూమిక, భారత్‌ మే ఫ్రౌఢశిక్షా తదితర గ్రంథాలను ఆమె రాశారు. ఈ గ్రంథాలు బహుళ ప్రజాదారణ పొందాయి.

ప్రజా సంఘాలు, ప్రభుత్వ సంస్థలు అసంఖ్యాకంగా అవార్డులను సమర్పించుకుని కుల్సుం సయాని సేవలను పట్ల ఉన్న గౌరవాన్ని ప్రకటించుకున్నాయి. 1959లో భారత ప్ర భుత్వంపద్మశ్రీ అవార్డుతో ఆమెను గౌరవించింది. భారత దేశంలో మాత్రమే కాకుండ ఇతర దేశాలలో కూడ వయోజన విద్యా వ్యాప్తికి ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా 1969లో నెహ్రూ˙ లిటరసీ అవార్డు అందించి భారత రాష్ట్రపతి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గాంధేయ మార్గంలో నిర్మాణాత్మక కృషి సల్పిన ప్రముఖ వ్యక్తిగా భారత ప్రభుత్వం ఆమెను ప్రశంసించింది. ఆమెకు నెహ్రూ లిటరసీ అవార్డు వచ్చినందుకు 1958లో ఇదే అవార్డు పొందిన Welthy Fisher అభినందనలు తెలుపుతూ, I rejoice that not only India but the world will catch the rays of light emanating through the noble work of Kulsum Sayani అని వ్యాఖ్యానించారు. ఆ ప్రశంసా వాక్యానికి సమాధానంగా, A Pioneer's lot in most cases is strewn with thorns - and mine 219