పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/221

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌నశీర్‌అహమ్మద్‌


ఆమె సహేతుకంగా ఎదుర్కొంటూ, తన అభిప్రాయాలను హేతుబద్దంగా సమర్ధించు కుంటూ దృఢమైన నిర్ణయాలతో కువిమర్శలను, నకారాత్మక చర్యలను సకారాత్మక సమాధానలతో తిప్పిగొట్టారు. కువిమర్శలను పక్కనపెట్టి ప్రజలలో విద్యావ్యాప్తికి, సంఘ నిర్మాణంలో ప్రజలు భాగస్వాములయ్యేట్టుగా చేయగల నిర్మాణాత్మక కార్యక్రమాల మీద దృష్టి సారించారు.

సమాజ సమగ్రాభివృద్ధికి వయోజన విద్యావ్యాప్తికి జరుగుతున్న ప్రయత్నాలు మాత్రమే చాలవని భావించిన కుల్సుం సయాని సంస్థల స్థాపనకు ప్రత్యేక కృషి ఆరంభించారు. వ్యక్తుల కంటే వ్యవస్థలు శాశ్వత ఫలితాలను తెచ్చిపెడతాయని ఆమె దృఢంగా నమ్మారు. ఆ నమ్మకంతో విద్యాసంస్థల స్థాపనకు కృషి చేశారు. విద్యావ్యాప్తికి కలసి వచ్చే ప్రజలు, ప్రముఖులతో కలసి ఆమె పలు విద్యాసంస్థల స్థాపనకు తోడ్పాటు అందించారు. ఆ విధగా రంగం మీదకు వచ్చిన విద్యాసంస్థలు సక్రమంగా నడవడానికి అవసరమగు ఆర్థిక ఆలంబన సమకూర్చిపెట్టటంలో కూడ ఆమె సహాయసహకారాలు అందించారు.

సమాజ సేవాకార్యక్రమాలలో కూడ భాగం పంచుకుంటూ సామాజిక రుగ్మతలు, మూఢనమ్మకాల మీదా పోరాటాలకు మార్గదార్శిగా నిలిచారు. సమాజాభివృద్దికి మహిళా చైతన్యం అత్యవసరమన్న మహాత్ముని ఉపదేశానికి అనుగుణంగా మహిళా సంక్షేమ, చైతన్య కార్యక్రమాలలో నిమగ్నమయ్యారు. 1943లో అఖిల భారత మహిళా కాన్పెరెన్స్‌ గౌరవ కార్యదర్శిగా నిమమితులయ్యారు. ఆమె భారత దేశమంతా పర్యటించి మహిళల్లో చెతన్యం కోసం, అకరాస్యత అభివృద్ధికోసం ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. అఖిలభారత మహిళా కాన్పెరెన్స్‌ను పటిష్ట పర్చేందుకు నిరంతరం సాగించిన కృషి ఫలించి 6,500 సభ్యులున్న అఖిల భారత మహిళా కాన్పెరెన్స్‌లో సభ్యుల సంఖ్య కాస్తా ఆమె హయాంలో 33,500కు చేరు కుంది. (Women Pioneers : Page. 93)

స్వతంత్ర భారతదశం అవతరించాక భవ్యభారతాన్ని నిర్మించేందుకు తగిన పధకాల అమలులో కూడ ఆమె పాలుపంచుకున్నారు. అవిశ్రాంతంగా సాగిస్తున్న సమాజ సేవ, వయోజన విద్యా, సాధారణ విద్యావ్యాప్తిలో సంపాదించిన అనుభవాన్ని వినియోగించు కునేందుకు ప్రభుత్వం పలు కమిటీలు, సంస్థలలో కుల్సుం సయానికి ప్రముఖ స్థానం కల్పించింది. ఆ సందర్భంగా ఆమె ఫ్రాన్స్‌, చైనా, డెన్మార్క్‌, ఇంగ్లాండ్‌, వియన్నా తదితర

218