పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/223

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌నశీర్‌అహమ్మద్‌

was no different. But the feeling of having done my bit for my country and my people is a reward in itself,అని కుల్సుం సయాని రాసి ఆమెలోని అతి సాధారణ సfiభావం, దేశబకని చాటుకున్నారు. (Women Pioneers : Page. 96).

1970లో మహాత్ముడి శాంతి సందేశాన్ని ప్రపంచ వ్యాపితం చేసే ప్రయత్నాలలో భాగంగా పదకొండు దేశాలను కుల్సుం సయాని చుట్టి వచ్చారు. ఆ దేశాలలో శాంతి-స్నేహ సందేశాలను బలంగా విన్పించారు. భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య స్నేహ సంబంధాలను పెంపొందించేందుకు ఆమె అవిశ్రాంతంగా శ్రమించారు. ఈ మేరకు తాను చేసిన ప్రయత్నాలను వివరిస్తూ ఆమె పుస్తకం కూడ రాశారు.

ఈ విధగా ఒకవపు జాతీయోద్యమంలో, మరొకవైపు వయోజన విద్యావ్యాప్తికి ఇంకొక వైపు ప్రజాసేవారంగంలో నిరంతరం శ్రమించి, జనజీవితాలను మరింతగా చక్కదిద్దేందాుకు, సమాజ సమగ్రాభివృద్ధి ప్రధాన లక్ష్యంగా సంపూర్ణ జీవితాన్ని అంకితం చేసన వయోజన విద్యావ్యాపకురాలు, అవిశ్రాంత ఉద్యమకారిణి శ్రీమతి కుల్సుం సయాని 1987మే 27న కన్నుమూశారు.

♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦

గొప్ప వ్యక్తుల తల్లులందరూ ఓ ప్రత్యేక మనస్తత్వం కలిగిన మహిళలని మనకు చరిత్ర తెలుపుతుంది. విజేతల తల్లులుధైర్య వంతులు, సంస్కరల అమ్మలు ఆలోచనా పరులు, మహాత్ముల తల్లులు మహనీయులుగా మనకు దార్శ నమిస్తారు . వ్యకిగతంగా ఒక పురుషుడి నైతికత స్త్రీ ద్వారా రూపుదిద్దికోవడమో లేక భ్రష్టు పట్టడమో జరుగుతుంది. ఓ జాతి నైతిక విలువలు, సామాజిక ఔన్నత్యం ఆ జాతికి చెందిన తల్లుల మానసిక స్థితి మీద ఆధారపడివుంటుంది. రాజకీయ ఔన్నత్యాన్ని గుత్తకు తీసుకున్నామని చెప్పుకునే జాతులను మనం పరిశీలిస్తే ఆ జాతులలోని మహిళలు రాజకీయంగా ఎంత పరిపక్వత కలిగి ఉండేవాళ్ళో, వాళ్ళల్లో మాతృభూమి పట్ల ప్రేమ ఎంత పొంగి పొర్లేదో మనకు అర్థమైతుంది. -జాహిదా ఖాతూన్‌ షేర్వానియా

♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦

220