పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/220

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారత స్వాతంత్రోద్యమం:ముస్లిం మహిళలు

విద్యావ్యాప్తి కోసం పునరంకితమయ్యారు. ఆమె అవిశ్రాంతంగా సాగించిన కృషి ఫలితంగా 30 సంవత్సరాల కాలంలో సుమారు ఐదు లక్షల మహిళలలో అక్షరజ్యోతులు వెలిగించ గలిగారు. ఆమె అంతటితో మిన్నకుండి పోలేదు. అక్షర జ్ఞానం గలిగిన మహిళలలో ఆ చెతన్యాన్ని మరింత సుస్థిరం చేయటమే కాకుండ, జాతీయ అంతర్జాతీయ వ్యవహారాలను కూడ తెలుసుకోగలిగిన స్థాయికి వారిని చేర్పించాలన్న సంకల్పంతో వయోజన విద్యా పూర్తి చేసిన పాఠకులను దృష్టిలో పెట్టుకుని మార్గాంవేషి అను అర్థ్దం వచ్చే రహబర్‌ అను ఉర్దూ పక్షపత్రికను ప్రారంభించారు.

భారతదేశంలో వయోజన విద్యా కార్యక్రమాల ప్రచారం కోసం ప్రారంభించబడిన తొలి పత్రికగా రహబర్‌ చరిత్ర సృష్టించింది. ఈ మేరకు వయోజన విద్యావ్యాప్తి కోసం పత్రికను నడిపన విద్యావేతగా కుల్సుం ఖ్యాతి గడంచారు. ఈ రహబర్‌ పత్రికను దేవనాగరి, గుజరాతీ లిపులలో 1960 వరకు క్రమం తప్పకుండ నడిపారు. వయోజనులకు, ఉద్యమ కార్యకర్తలకు రహబర్‌ కరదీపికగా వెలిసింది. ఆమె స్వయం సంపాదకత్వంలో ప్రచురితమైన రహబర్‌ పత్రిక ఉర్దూ దేవనాగరి, గుజరాతి లిపులను పాఠకులకు నేర్పడానికి అతి సులువెన పద్దతు లను ప్రవేశ పెట్టింది. ఆ కారణంగా రహబర్‌ ద్వారా డకర్‌ తారాచంద్‌ ప్రముఖ చరిత్రకారులు గుజరాతి లిపిని నేర్చుకున్నట్టు స్వయంగా ప్రకించటం విశేషం. (Women Pioneers : Page. 94).

రహబర్‌ పత్రికను కుల్సుం సయాని కేవలం వయోజన విద్యావ్యాప్తికి మాత్రమే పరిమితం చేయ లేదు . ప్రజలలో జాతీయ భావనలు పెంపొందించడనికి, మతసామరస్యం, హిందూ -ముస్లింల ఐక్యత, స్నేహం,శాంతి, సద్భావనల ప్రచారానికి కూడ రహబర్‌ను సాధనం చేసుకున్నారు. అహేతుక భావనలకు, అర్థంలేని ఆచార, సంప్రదాయాలకు వ్యతిరేకంగా మహిళలను చైతన్యవంతుల్ని చేయడనికి అవసరమగు సమాచారాన్ని సేకరించి రహబర్‌ ద్వారా పాఠకులకు అందించారు. అన్ని మతాల సాంప్రదాయాలను, అన్ని జాతుల సంస్కృతి నాగరికతలలోని విశేషాంశాలను పాఠకులకు అందుబాటులోకి తెచ్చారు. మతాలు, ఆచార సంప్రదాయాలు వేరైనా మనుషులంతా ఒక్కటేనన్న విశ్వ మానవ సోదారభావాన్ని బలంగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా సనాతన ఆచార, సంప్రదాయ రక్షకులమని ప్రకించుకున్న ధార్మిక పండితులు, మౌల్వీలు ఆమె అభిప్రాయాలను వ్యతిరేకిస్తూ ఆమె మీద విమర్శల యుద్ధం ఆరంభించారు. ఆ విమర్శలను


217