పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/219

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌నశీర్‌అహమ్మద్‌


మహిళల విశ్వాసాన్ని చూరగొన్నారు. ఆ తరు వాత ఒక్కక్కొరిగా మహిళలతో సంప్రదింపులు జరుపుతూ వారందర్ని సంఘటితపర్చి, అక్షరాస్యత ఆవశ్యకతను అంగీకరింపచేశారు. వయోజన విద్యా కార్యక్రమంలో భాగంగా అవసరమగు విద్యాసామగ్రిని స్వయంగా మహిళలకు అందచేస్తూ, వారితో కలసి మెలుగుతూ వయోజన విద్యా తరగతులను ఏర్పాటు చేయగలిగారు. ఈ మేరకు బొంబాయి నగరం, ఆ పరిసర ప్రాంతాలలోని పేటలు, మురికివాడలలో నిరంతరం పర్యటిస్తూ కార్యక్రమాలను పర్య వేక్షిసూ, వయోజన విద్యా వ్యాప్తికి అవిశ్రాంత కృషి ప్రారంభించారు.

ఆ నిరక్షరాస్యులలో ముస్లింలు అత్యధికులు కావటంతో ఆమె ముస్లిం మహిళల పట్ల ప్రత్యేక శద్థ్రవహించి వయోజన విద్యా, వికాస కార్యక్రమాలలో భాగస్వాములను చేయగలగటంతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ కార్యక్రమాల పట్ల భారత జాతీయ కాంగ్రెస్‌ నాయకులు అధిక శ్రద్ధను చూపటంతో స్వార్థ రాజకీయాలు రంగప్రవేశం చేశాయి. ఆమె కార్యక్రమాలకు వ్యతిరేకంగా ముస్లింలీగ్ కార్యకర్తలు అసత్య ప్రచారాలకు దిగారు. ఆమె మీద నిందారోపణలు చేశారు. ముస్లిం జనసముదాయాలలో ఆమె కార్యక్రమాల పట్ల విముఖత కలిగించేందుకు విఫల ప్రయత్నాలు చేశారు. ఖద్ధరు ధరించి వయోజన విద్యా కార్యక్రమాల పేరిట ముస్లిం మహిళలను భారత జాతీయ కాంగ్రెస్‌ వైపుకు ఆకర్షిస్తు న్నారని కొందరు ముస్లింలీగ్ నేతలు భావించారు. అందువలన సమాంతర కార్యక్రమాలను నిర్వహించాలని ఆలోచన కూడ చేశారు. (Bharath Ke Swatantra Samgram me Muslim Mahilavonka Yogdaan (Hindi) : Page. 265)

ఆ ప్రతికూల ప్రయత్నాల వలన కుల్సుం సయాని ఏమాత్రం ప్రబావితం కాలేదు. ఆ దుష్ప్రచారాన్ని చాలా చాకచక్యంగా ఎదుర్కొన్నారు. అన్ని అవరోధాలను తేలిగ్గా అధిగమించారు. మహిళల్లో విద్యావ్యాప్తి కోసం ఆమె బొంబాయి నగరంలోని ఐదు అంతస్తుల ఎత్తుగల భవనాలను కూడ ఎంతో ప్రయాసతో ఎక్కుతూ-దిగుతూ, ఆయా అపార్టుమెంట్లలో దొరికిన కొద్దిపాటి స్థలంలో మహిళలను సమావేశపర్చి వారికి విద్యాబుధులు గరుపుతున్న ఆమెలోని సద్భావన, నిజాయితీ, చిత్తశుద్ధిని ప్రజలు గ్రహంచారు. ఆమెకు మద్దతు తెలిపారు. ఆ కారణంగా స్వార్ధ రాజకీయ వర్గాల ప్రచారాలు ఆమె ప్రయత్నాలకు ఏమాత్రం అడ్డుకట్ట వేయలేకపోయాయి.

అవాంతరాలు అధిగమించిన కుల్సుం సయాని మరింత ఉత్సాహంతో వయోజన


216