పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/217

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌నశీర్‌అహమ్మద్‌


ఆ విధాంగా మహాత్ముని సన్నిధిలో జానకీ దేవి బజాజ్‌ వద్ద ఉంటున్నప్పుడు, జాతీయోద్యమ కార్యక్రమాలు, సంఘ సంస్కరణలో భాగంగా మహత్ముడి మారదర్ కత్వంలో ఆరంభమై న కార్యకలాపాల గురించి బేగం కుల్సుంకు ఆమె వివరిస్తూ ముస్లిం మహిళలలో ప్రధానంగా పర్దానషి మహిళలలో పనిచేయటం చాలా కష్టతరమవుతున్న విషయాన్ని తెలిపారు. ముస్లిం మహిళలను సమావేశపర్చాలని ఎంత కష్టపడి ప్రయత్నం చేసినా పట్టుమని పదిమంది రావటం లేదని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. ఆ ప్రతికూలాంశం కుల్సుంలో ఆలోచనలను రగిలించింది. ఆ ఆలోచనలు ఆమెలో లక్ష్యాన్ని నిర్దేశించాయి. మహిళలలో ప్రదానంగా ముస్లిం మహిళలలో పనిచేయాలని ఆమె నిర్ణయించుకున్నారు. (Women Pioneers, Edited by Sushila Nayar & Kamala Mankekar, ariticle on Kulsum Sayani is writtern by Ushaa Mehatha, NBT, India, 2002, page. 93) ఆ నిర్ణయం మేరకు మహాత్మా గాంధీజీ సిద్ధాంతాలతో ప్రభావితమైన కుటుంబ సభ్యురాలు కనుక కుల్సుం జాతీయోద్యమంలో భాగంగా గాంధీజీ మారదర్ కత్వంలో సంఘ సంస్కరణ కార్యకలాపాల దిశగా ముందుకు సాగారు.

కరాచీలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్‌ సమావేశానికి అధ్యాక్షత వహించిన ప్రముఖ స్వాతంత్య్రసమరయాధుడు ముహమ్మద్‌ రహమతుల్లా సయాని మేనల్లుడు డాక్టర్‌ జాన్‌ ముహమ్మద్‌ సయానీని ఆమె వివాహమాడరు. డాక్టర్‌ సయాని చాలా మృదు స్వభావులు. ఆయన ప్రజల డాక్టరుగా ఖ్యాతిగాంచిన వైద్యులు. డాక్టర్‌ సయాని కూడ ఇటు జాతీయోద్యమ కార్యక్రమాలలో పాల్గొనటం మాత్రమే కాకుండ అటు ప్రజాసేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్నారు. ఆయన జాతీయ కాంగ్రెస్‌ సభ్యులు మాత్రమే కాక ఖిలాఫత్‌ ఉద్యామ నాయకులు.

వివాహం తరువాత పూర్తికాలం సంఘసేవికగా ప్రజాసేవకు అంకితం కావాలనుకున్న కుల్సుం నిర్ణయాన్ని డాక్టర్‌ సయానీ బలపర్చడమే కాకుండ మరింతగా ప్రోత్సహించి ఆమెకు తోడుగా నిలిచారు. ఆయన నుండి లభించిన ప్రోత్సాహంతో ఉత్తేజితులైన కుల్సుం సయాని తాను వివాహానికి ముందుగానే నిర్ధేశించుకున్న లక్ష్యాల సాధనకు ప్రణాళికను తయారు చేసుకున్నారు. మహిళలను చైతన్యవంతుల్ని చేయాలన్న కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్న ఆమె మహిళలలో ప్రదానంగా ముస్లిం మహిళలలో, నిరక్షరాస్యులు అధికంగా ఉండటం గమనించారు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలకు,


214