పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/216

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వయోజన విద్యావ్యాపకురాలు, సంఘసేవిక

'పద్మశ్రీ' కుల్సుం సయాని

(1900-1987)

భారత జాతీయోద్యమం ఉద్యామకారులను బ్రిటీష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం సాగించేందుకు మాత్రమే కాకుండ, సమాజ ప్రగతికి ఆటంకం అవుతున్న సామాజికరుగ్మతలకు వ్యతిరేకంగా పోరు సల్పడానికి చక్కని ప్రేరణ కల్గించింది. ప్రధానంగా స్వరాజ్య స్థాపనకు కృషి సాగిస్తూ స్వరాజ్యంలో ప్రజలంతా సుఖశాంతులతో ప్రగతిపదాన నడిచేందుకు అవసరమైన చక్కటి వాతావరణం సృషించేందుకు కృషిచేశారు. ఒకవైపు పరాయి పాలకులకు వ్యతిరేకంగా సాగుతున్న పోరాలకు పరోక్ష సహకారం అందిస్తూ గాంధీజీ మార్గాన నిరక్షరాస్యులను అక్షరాస్యులను చేయటమే ప్రదాన ధ్యేయంగా ఉద్యమించిన మహిళలలో అగ్రగామి శ్రీమతి కుల్సుం.

గుజరాత్‌ రాష్ట్రానికి చెందిన కుల్సుంస్వాతంత్య్ర సమరయోధుల కుటుంబంలో 1900 అక్టోబర్‌ 21న జన్మించారు. మహాత్మాగాంధీ వ్యకిగత వెద్యులు, సన్నిహిత మిత్రులు డాక్టర్‌ రజబ్‌ అలీకి ఆమె ముద్దుబిడ్డ. విద్యార్థి దశలోనే జాతీయోద్యమం, సమాజ సేవ ఆమెకు పరిచయ మయ్యాయి.1917 ప్రాంతంలో తండ్రితోపాటుగా ఆమె మహాత్మాగాంధీని కలిశారు. ఆ తండ్రుకూతుళ్ళను ప్రేమతో ఆహ్వానించిన గాంధీజీ కొంత కాలం పాటు ఆమెను ప్రముఖ సంఘసేవిక జానకీ దేవి బజాజ్‌ వద్దా ఉండమన్నారు.

213