పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/218

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారత స్వాతంత్రోద్యమం:ముస్లిం మహిళలు


చైతన్యరాహిత్యానికి ప్రదాన కారణం అవిద్యగా ఆమె గమనించారు. ఆ సమస్యల పరిష్కార దిశగా వయోజన విద్యా ప్రచారోద్యామాన్ని నిర్వహించాలని మహాత్ముడు చేసిన సూచనలతో ఆమె ప్రేరణ పొందారు. ఆ దిశగా నిరక్షరాస్యులలో అక్షరజ్యోతులను వెలిగించేందుకు కుల్సుం సయాని సంకల్పబద్ధులయ్యారు.

1927లో జాతీయోద్యామంలో భాగంగా జరుగుతున్న చర్ఖాక్లాసు సభ్యత్వాన్ని కుల్సుం స్వీకరించారు. సామాజిక ప్రగతికి ఆటంకమౌతున్న రుగ్మతల గురించి ప్రజలలో చైతన్యం కలిగించేందుకు ఉద్దేశించబడిన జనజాగరణ కార్యక్రమాలలో భాగస్వామి అయ్యేందుకు యూనిటీ క్లబ్‌ సబ్యులయ్యారు.యూనిటీ క్లబ్‌ సబ్యురాలుగా ఆమె చూపిన సేవాతత్పరత, కార్యదక్షతల ఫలితంగా క్రమక్రమంగా పలు పదవులను అథిరోహిస్తూ 1930లో ఆమె క్లబ్‌ ప్రధాన కార్యదర్శి అయ్యారు. ఆ ఆవకాశాన్ని వినియోగించుకుని యూనిటీ క్లబ్‌ నాయకురాలిగా ప్రణాళికాబద్దంగా కార్యక్రమాలకు ఆమె శ్రీకారంచుట్టారు .


1936లో ఆమె ప్రయయత్నాలు గొప్ప మలుపు తిరిగాయి. ఆ సమయంలో జాతీయ కాంగ్రెస్‌ నాయకులు బాలా సాహెబ్‌ ఖేర్‌ నాయకత్వంలో బొంబాయి ప్రాంతీయ ప్రభుత్వం ఏర్పడింది. ఆయన వ్యక్తిగతంగా కూడ వయోజన విద్యకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు. బాలా సాహెబ్‌ ఖేర్‌ వయోజన విద్యా కార్యక్రమాల పట్ల ప్రత్యేక ఆసక్తిగల ప్రముఖులు కావటం కులుస్సుంకు కలసి వచ్చింది. వయోజనులలో అక్షరాస్యతను పెంపొందించేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలు, ఆ కార్యక్రమాల నిర్వహణ - పర్యవేక్షణ కోసం స్వయంగా తన అధ్యక్షతన ఓ కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీలో సహజంగా కుల్సుం సయానికి తొలి సభ్యత్వం లభించింది. ఆమె ఆశయానికి అధికారం కూడ తోడవడంతో మరింత చురుకుగా ఆమె ముందుకు కదిలారు. ఆ కృషికి గుర్తింపుగా 1939లో ఆమె ఆ కమిటీ ఉపాధ్యాక్షులుగా నియుక్తులయ్యారు.

అప్పటినుండి వయోజన విద్యా కార్యక్రమాలలో ఆమె పూర్తిగా లగ్నమయ్యారు. ప్రధానంగా మహిళలలో అక్షరజ్ఞానం కలిగించేందుకు ఆమె నడుం కట్టారు. ఆమె ప్రయత్నాలు తొలిదశలో ఫలించలేదు. ప్రధానంగా ముస్లిం మహిళలకు నచ్చచెప్పటం ఆమెకు కష్టమైపోయింది. చదువు ఎందుకని ప్రశ్నించే మహిళలకు నచ్చచెప్పేందుకు ఆమె చాలా శ్రమించారు. బొంబాయి నగరంలోని మహిళల సమస్యలు తెలుసుకుంటూ, ఆ సమస్యల పరిష్కారంలో అక్షర జ్ఞానం ఎలా ఉపయాగపడుతుందో వివరిస్తూ క్రమంగా


215