పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/196

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారత స్వాతంత్రోద్యమం:ముస్లిం మహిళలు


విభజన సమయంలో ఎదురైన

భయానక పరిస్థితుల బాధితులను ఆదుకునేందుకు ఆమె బాగా శ్రమించారు. నిస్సహాయ మహిళల సమస్యను అమతుస్సలాం ప్రదానంగా స్వీకరించారు. మృద్రులా సారాబాయి, సుభద్రా జోషి ల తో క ల సి అటు పాకిస్థాన్‌ ఇటు ఇండియా నుండి వేరుపడిన మహిళలను తమవారున్న ప్రాంతాలకు సురక్షితంగా చేర్చటం కోసం అమితంగా శ్రమించారు. ఈ పని మీద ఆమె పలుమార్లు పాకిస్థాన్‌ కూడ వెళ్ళారు.

ఆ తరువాత పంజాబ్‌లోని రాజపూర్‌ గ్రామంలో తనను కన్న కూతురులా చూసుకున్న కస్తూర్బా గాంధీ పేరిట కసూర్బా మందిరం అను ఆశ్రమాన్ని నెలకొల్పారు. ఆశ్రమంలో మహిళలకు చేతి వృతులను నేర్పటం, అకర జ్ఞానం అందించటం తదితర కార్యక్రమాలను చేపట్టారు. నిస్సహాయులైన మహిళలు తమ కాళ్ళమీద తాము నిలబడగలిగే ఆర్థిక బలాన్ని చేకూర్చేందుకు పలు పథకాలను రూపొందించి అమలు చేశారు.ఈ ఆశ్రమానికి సంబంధించి పలు శాఖలను ఆమె ఏర్పాటు చేశారు. అంటరానితనం మీద యుద్ధం ప్రకిటించారు. దళిత జనులలో అక్షరజ్యోతులను వెలింగించేందుకు ప్రయత్నించారు. ఆశ్రమంలో కార్యకలాపాలను ఆమె తన పర్యవేక్షణలో నిర్వహిస్తూ అటు దళితుల, ఇటు మహిళల సేవలకు అంకితమయ్యారు.

సంపన్న జమీందారీ కుటుంబం నుండి తన భాగంగా లభించిన అతి విలువైన ఆస్థిపాస్థులను కస్తూర్బా ఆశ్రమ కార్యకలాపాల నిర్వహణకు వినియోగిస్తూ హరి జనోద్దరణకు, నిస్సహాయ మహిళలకు చేయూతనివ్వటం కోసం ఎన్నో కార్యక్రమాలను, వ్యవస్థలను అమతుస్సలాం రూపొందించారు. శిశు సంక్షేమ కార్యాలయాలు, పాఠశాలలు,


193