పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌నశీర్‌అహమ్మద్‌

సింధ్‌ ప్రాంతంలో మత ఘర్షణలు జరుగుతుండగా అమతుస్సలారను అక్కడకు పంపుతూ ఆయన సన్నిహితులు ఆనంద్‌ హింగోరికి 1940 నవంబరు 6న గాంధీజీ లేఖ రాశారు. ఆ లేఖలో, సింధ్‌లో జరుగుతున్న భయానక ఘర్షణలను ఆపేందుకు ఆమె ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వస్తుంది...ఆమె చాలా ధైర్యస్థురాలు, హింసాకాండను అడ్డుకునేందుకు ఆమె తన ప్రాణాలను సైతం పణంగా పెట్టగలదు అని ఆ ప్రాంతంలోని తన ఇతర పరిచయస్తులకు రాసిన ఒక లేఖలో గాంధీజీ పేర్కొన్నారు.

ఈ మేరకు మత ఘర్షణలలో భాగంగా హింస ప్రజ్వరిల్లినప్పుడల్లా,వాటిని నిరోధించేందుకు ప్రజలలో స్నేహభావాన్ని పెంపొందించి శాంతి,సామరస్యాలు కాపాడేందుకు ఆమె చేసిన కృషిని సరిహద్దు గాంధీ ఖాన్‌ అబ్దుల్‌ గపూర్‌ ఖాన్‌ 1943లో రాసిన ఉత్తరంలో ఎంతగానో కొనియాడరు.

నౌఖాళి మత కలహాలలో అక్కడ జరుగుతున్న హత్యాకాండను, హింసాత్మక వాతావరణాన్ని నివారించేందుకు మహాత్ముని ఆదేశాల మేరకు ఆమె వెళ్ళారు. అక్కడి పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు శతవిధాల ప్రయత్నించి చివరి అస్త్రంగా ఆమె సత్యాగ్రహ దీక్షను చేప్టారు. గాంధేయవాదిగా ఆమె చేప్టిన సత్యాగ్రహదీక్ష 20 రోజులపాటు సాగింది. ఆమెలో ఉన్న చిత్తశుద్ది, హిందూ-ముస్లింల మధ్యన ఆమె కోరుకుంటున్న ఐక్యత పట్ల ఉన్న నిబద్ధతను ఆర్థంచేసుకున్న ఇరువర్గాలు మతసామరస్య వాతావరణం ఏర్పడేందుకు దోహదపడ్డాయి. ఆ తరువాత గాంధీజీ ఆక్కడకు వెళ్ళి ఆయన స్వయంగా అందించిన పళ్ళ రసం సేవించి అమతుస్సలాం సత్యాగ్రహ దీక్షను విరమించారు. ఈ విధామైన సాహసోపేత కార్యక్రమాలతో గాంధీజీ నిజమైన వారసురాలుగా ఆమె ఖ్యాతిని దాచుకున్నారు.

స్వేచ్ఛా భారతం కోసం కలలుగన్న జాతీయోద్యమకారులు తాము కన్నకలలను భగ్నం చేస్తూ ఇండియా ముక్కలయ్యింది. ఆ విభజన కూడ మతం పేరిట సాగటంతో అమతుస్సలాం చలించి పోయారు. ఆ విఘాతం నుంచి బయట పడేలోపుగా గాంధీజీ హత్యకు గురయారయ్యారు. కన్నబిడ్డలా ఆదారించిన మార్గనిర్థేశం చేసి, అనారోగ్యపీడిత శరీరానికి మానసిక స్థైరాన్ని కలుగచేసే ఉపదేశం ఇచ్చిన మహాత్ముడు ఆకస్మికంగా అంతర్థానమయ్యేసరికి ఆమె తట్టుకోలేక పోయారు. ఆ ఆవేదన నుండి త్వరిత గతిన బయటపడి గాంధీజీ చూపిన బాటలో ప్రజల సేవకు ఆమె పూర్తిగా పునరంకితం అయ్యారు. 192