పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/190

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారత స్వాతంత్యోద్యమం ముస్లిం మహిళలు


బొంబాయిలోని మా కుటుంబ వైద్యులు

డాకర్‌ బలమౌర్యను ఆయన సంప్రదించారు. నిరంతరం జ్వరంతో భాథాపడుతూ అమె వివాహం చేసుకోవటం ప్రమాదకరమని, మూడేండ్లు జ్వరం రానట్టయితే వివాహం చేయ వచ్చని ఆయన ఆన్నారు . ఆ ఆవకాశాన్ని నేను దొరకపు చ్చుకుని ఆరోగ్యం చెడగొట్టు కోసాగాను. ఆ దుష్పలితాలను ఈనాికి కూడ నేను అనుభవిస్తున్నాను.

ఇరవై సంవత్సరాల వయస్సులో నా ఆరోగ్యం కొంత కుదుట టపడటంతో అన్నయ్యలు నా పెళ్ళి ప్రయత్నాలను మళ్ళీ ప్రారంభించారు. నా ఇష్టాయిష్టాలు ఎవ్వరికీ పట్టలేదు. ఆ అనివార్య పరిస్థితులలో మీకు ఎక్కడ మంచిది అన్పిస్తే అక్కడ నా వివాహం చేయండి. అయితే నా భర్త రెండవ పెండ్లి చేసుకోడానికి నా పూర్తి అనుమతి ఉంటుందని నా అభిమతాన్ని నేను ప్రకటించాను. నా అభిప్రాయంతో అన్నయ్యలకు ఏకీభావన ఉన్నా, తండ్రి మరణానంతరం ఆరుగురు అన్నదమ్ములు ఉండి కూడ చెల్లెలు వివాహం చేయలేదని సమాజం ఎత్తిపొడుస్తుందని భయం కూడ ఉంది.

మా పెద్దన్నflయ్య అబ్దుర్రషీద్‌ ఖాన్‌ 1922లో జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షు లయ్యారు. ఆయన ఉద్యమంలో పాల్గొన్నందుకు ఆరు మాసాలు జైలుశిక్షకు గురయ్యారు. నేను బుర్ఖాధరించి అంబాలాలోని వీధుల్లో తిరిగి ఖద్దరు ప్రచారం చేయసాగాను. పలు సమావేశాలు, సభలకు హజరు కాసాగాను. బేగం ముహమ్మద్‌ అలీ జోహర్‌, ఆయన తల్లి బీబీ అమ్మల పర్యటనలు తరచుగా పంజాబులో జరిగేవి. ఆ పర్యటనల ప్రభావం నామీద ఉండేది. ప్రజాసేవ చేయాలన్న ఉత్సాహం పెరగసాగింది. మా అన్న ఆరు మాసాలు జైలులో ఉన్నప్పుడు మా పిల్లల శరీరాల మీద ఖద్దారే ఖద్దరు కన్పించింది. అమ్మ చాలా సున్నితం. అందువలన ఆమె ఖద్దరు ధరిస్తే ఆమె నాజూకు శరీరం

187