పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌నశీర్‌అహమ్మద్‌


అమతుస్సలాం 1930-1931 ప్రాంతంలో మహాత్ముని సేవాగ్రాం ఆశ్రమం వచ్చి చేరారు. పాియాలా సంస్థానంలోని సనాతన ముస్లిం కుటుంబంలోని ఏకైక పుత్రిక ఆశ్రమంలోకి ఎలా వచ్చారన్న విషయం ఆసక్తిదాయకం. ఈ క్రమాన్నిబాపూ కే సాత్‌ అను వ్యాసంలో ఆమె స్వయంగా వివరించారు. ఆ కథానం ఇలా సాగింది.

నా 13 సంవత్సరాలు వయస్సులో నేను ఖురాన్‌ మజీద్‌ను అనువాదంతో సహాపఠించాను. కొన్ని ధార్మిక గ్రంథాలను కూడ అధ్యాయనం చేశాను. మా కుటుంబంలో పర్దాను కఠినంగా అమలు చేసేవారు. స్వంత అన్నదమ్ముల ఎదుట కూడ సంచరించడానికి అనుమతి లభించేదికాదు. ఆ కారణంగా స్కూలుకు వెళ్ళే ప్రశ్నతలెత్తలేదు. నాన్న నన్ను అలీఘర్‌లోని బాలికల స్కూలుకు పంపాలనుకున్నారు. జాతి అభివృద్ధి నిమితం సామాజిక ఆంక్షలను ఉల్లంఘంచగల సాహసం ఆయనకుంది. ఆయన మరణంచటంతో దురదృష్టవశాత్తు ఆ ఆవకాశం నాకు లభించలేదు. ఆయన ఆకస్మికంగా మృత్యువాత పడ్డారు. ఆ కారణంగా నా చదువు ఉర్దూ రాయటం, చదవటం వరకు పరిమితమైంది.

నా పెదన్న ముహమ్మద్‌ అబ్దుర్రషద్‌ ఖాన్‌ జాతిజనుల సేవచేయాలన్నఆలోచనలను నాలో కలించారు. బ్రిీష్‌ ప్రబుత్యానికి వ్యతిరేకంగా 1920లో సాగిన ఖిలాఫత-సహాయ నిరాకరణ ఉద్యమంలో ఆయన పాల్గొన్నారు. నా వివాహం త్వరిత గతిన చేయాలనుకుంటున్న మా ఆమ్మకు చిన్న వయస్సులో నా వివాహం చేయటం మంచిది కాదని ఆయన నచ్చచెప్పారు. ఒకవేళ నీవు నామాట వినకుండ చెల్లెలి వివాహం చేయదలచుకుంటే తాను ఆ వివాహానికి రానన్నారు. ఆ హెచ్చరికతో చిన్నన్నయ్యల ప్రమేయం లేకుండ పోయింది. అప్పటికి నా వివాహప్రయత్నాలు ఆగిపోయాయి.

చిన్నటిప్ప నుండి విలాసవంతంగా గడపటం, విలువైన వస్త్రాలు, ఖరీదైన ఆభరణాలు ధరించటం అంటే అయిష్టత ఉండేది. నా ఎదుట ఒక లక్ష్తంగాని, నా ఇష్టాయిష్టాలను అమ్మతో, అన్నయ్యలతో వ్యక్తంచేయగల సాహసం గాని లేదు. ఏకైక కుమార్తె కోసం అమ్మ ఎల్లప్పుడూ మంచి మంచి దుస్తులు, ఆభరణాలు తయారు చేయించేది. అవి నాకు నచ్చేవి కావు. చిన్ననాటి నుండి నా ఆరోగ్యం అంతగా మంచిది కాదు. సబర్మతీ ఆశ్రమం వెళ్ళేముందాు నేను టి.బి వ్యాధికి గురయ్యాను. ఈ మధ్యలో మళ్ళీ అమ్మ నా పెండ్లి గురించి పెద్దన్నయ్య మీదా ఒత్తిడి తీసుకురా సాగింది.

186