పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మత కలహాల మధ్యకు నడిచిన అహింసాయోధురాలు

బీబీ అమతుస్సలాం

(1907-1985)

స్వాతంత్య్రోద్యామ చరిత్రలో భాగంగా పరాయి పాలకుల బానిసత్వం నుండి గాంధేయ మార్గాన మాత్రమే స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు సాధ్యామని భావించి మహాత్ముని సాన్నిహిత్యంలో జీవితచరమాంకం వరకు గడపన మహతర చారిత్రక ఆవకాశం అతికొద్ది మందికి మాత్రమే దాక్కింది. అటువిం అద్భాుత అవకాశాన్ని సొంతం చేసుకున్నఅధృష్టవంతులలో ప్రముఖస్థానం ఆక్రమించారు బీబీ అమతుస్సలాం.

భారత జాతీయోద్యామం పట్ల అపార గౌరవాభిమానాలను ఆచరణలో వ్యక్తం చేసిన పాటియాలా రాజపుఠాణా పరివారంలో 1907లో బీబీ అమతుస్సలాం జన్మించారు. తల్లి పేరు అమతుర్రెహమాన్‌. తండ్రి కబ్దుల్‌ అబ్దుల్‌ హమీద్‌ పాటియాలా సంస్థానంలో ఆర్థిక మంత్రి. ఆయన 1920 ప్రాంతంలో కన్నుమూశారు. ఆరుగురు అన్నదామ్ములకు ఏకైక చెల్లెలిగా అమతుస్సలాం గారాబంగా పెరిగారు.

చిన్ననాటి నుండి స్వేచ్ఛావ స్వభావాన్ని వ్యక్తం చేసిన ఆమె సమకాలీన సమాజాన్ని ఆధ్యయనం చేసి పురాతన రీతి రివాజులను అహేతుక ఆచార, సంప్రదాయాలను వ్యతిరేకించారు. సామాజిక, రాజకీయ సమస్యల పట్ల మంచి అవగాహన కలిగి ఉన్నా, శారీరకంగా చాలా బలహీనం కావటంతో ఆమెకు ఆరోగ్యం అంతగా సహకరించేది కాదు. 185