పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌నశీర్‌అహమ్మద్‌

గాయాలమయమయ్యేది. ఖిలాఫత్‌ ఉద్యమం సందర్భంగా హిందూ-ముస్లింలలో వ్యక్తమైన ఏకతా భావనను మరువలేను. బాపూ 21 రోజులపాటు నిర్వహించిన వ్రతం నా హృదయం మీద గాఢమైన ప్రభావం వేసింది.

నా ఎదుట భవిష్యత్తుకు సంబంధించిన ప్రశ్నలు తలెత్తాయి. వివాహం చేసుకోదలచుకో లేదు, అయితే జీవితానికి ఏదో లక్ష్యం ఉండాలి. బాపూ నిర్వహిస్తున్న పలు ఆందోళనా కార్యక్రమాల గురించి వార్తా పత్రికల ద్వారా తెలుసుకుంటున్నాను. దండి యాత్రలో పాల్గొనాలని ఆసక్తి కలిగింది. స్వయంగా స్వేచ్ఛను కోల్పోయినదానను. ఆందోళనా కార్యక్రమాలలో పాల్గొనటం ఎలా సాధ్యం?...బ్రిటిషు వారి బానిసత్వంలో న్యాయవాద వృత్తి చేయకూడదాని అన్నయ్య అబ్దుర్రషీద్‌ నిర్ణయించుకున్నారు. ఆయన స్నేహితుడు ఆయనను ఇండోరు మహారాజు కార్యదర్శిగా ఇండోరు తీసుకెళ్ళారు.

ఆ క్రమంలో అమతుస్సలాం దేశసేవలో గడపాలని నిశ్చయించుకున్నారు. ఇండోరు వెళ్ళ క ముందు జాతీయోద్యామకారుడైన అబ్దుర్రషీద్‌ జాతీయోద్యమం విశేషాలను అమతుస్సలాంకు వివరించేవారు. జాతీయ భావాలను ఉద్భోదించే గ్రంథాలను ఆయన ఇంటికి తెచ్చేవారు. ఆ గ్రంథాలను, వార్తాపత్రికలను చదువుతూ జాతీయోద్యమం పట్ల ఆమె ఆసక్తి పెంచుకున్నారు. గాంధీజీ గురించి, అలీ సోదరుల తల్లి ఆబాది బానో బేగం, ముహమ్మద్‌ అలీ భార్య అంజాది బానో బేగం సేవల గురించి పత్రికలద్వారా తెలుసుకున్నారు.

మహాత్ముని అహింసా సిద్థాతం, ఆయన వ్యక్తిత్వం పట్ల అమతుస్సలాం బాగా ఆకర్షితులయ్యారు. ఆయన రాసిన ఆత్మకథను కూడ ఎంతో ఆసక్తిగా చదివారు. ఆ పుస్తకం ఆమెలో నూతన ఉత్తేజాన్ని కలిగించింది. భవిష్యత్తుకు సంబంధించిన ప్రశ్నకు సమాధానం దొరికింది. ఆమెకు నూతన మార్గం గోచరించింది. ఆ ప్రబావంతో మహాత్ముని బాటలో పయ నించాలని ఆమె నిశ్చయించుకున్నారు. ఆ సమయంలో మహాత్ముడు సబర్మతీ ఆశ్రమంలో ఉన్నారు. అమె కూడ సబర్మతి ఆశ్రమంలో చేరాలన్న నిర్ణయానికి వచ్చారు. ఆమె అనారోగ్యం అందుకు అడ్డుగా నిలచింది. ఆ కారణంగా, ఆశ్రమ జీవితంలోని కఠిన నియమనిబంధనల మూలంగా ఆమెకు ఆశ్రమ ప్రవేశం సులభంగా లభించలేదు.

ఈ విషయాన్ని కూడ ఆమె వివరించారు. ఆ వివరణ ప్రకారంగా, నేను సబర్మతీ ఆశ్రమం వెళ్ళదలిచానని అన్నయ్యలతో చెప్పాను. ఓ నవ్వునవ్వి వారు ఊరకున్నారు.

188