పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌నశీర్‌అహమ్మద్‌


ఉద్యమంలో, భారత జాతీయ కాంగ్రెస్‌ సమావేశాలన్నిటిలో పాల్గొన్నారు. 1921లో అహమ్మదాబాద్‌ లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్‌ వర్కింగ్ కమిటీ సమావేశాలకు ఆమె ఉత్తర ప్రదశ్‌ ప్రతినిధిగా హజరయ్యారు. ఖిలాఫత్- సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా మహాత్ముడు, మౌలానా సోదరులు కలసి సాగించిన దేశవ్యాప్త పర్యటనల సందర్భంగా ఆ బృందంలో ఆమె సభ్యురాలిగా ఉన్నారు. ఈ సందర్భంగా ఆయా కార్యక్రమాల ప్రచారం విషయంలో శ్రద్ధ చూపటమే కాకుండా, ఆర్థిక వ్యవహారాలను ఆమె స్వయంగా పర్యవేక్షించారు. ఈ విషయాన్నిమౌలానా ప్రస్తావిస్తూ, ఆమె ఆ విషయాలలో నాకంటే సమర్ధురాలు...అనాటి మహిళలతో బేరిజు వేసినట్టయితే ఆమె ఖచ్చితంగా క్రియాశీలకంగా కార్యక్రమాలు నిర్వహించటంలో దిట్టగా పరిగణించవచ్చు అన్నారు.

జైలు నుండి తిరుగు ప్రయాణానికి టిక్కెటు తీసుకుని వచ్చాను అంటూ జైలు శిక్షలు తమ జీవితంలో భాగమని భావించిన మౌలానా ముహ్మద్‌ అలీ ఎక్కువ కాలం జైళ్ళల్లో గడపటం వలన పలు సందర్భాలలో ఆయన బాధ్యతలను అంజాదీ బేగం స్వీకరించారు. అటు కుటుంబపరమైన విషయాలు గాని, ఇటు ఉద్యమపరమైన కార్యక్రమాలను గాని ఆమె ఎంతో సమర్థవంతంగా నిర్వహించారు. ఖిలాపత్‌ ఉద్యమం సందార్భంగా అత్యధిక సమయం మౌలానా ఇంటిబయట ఉంటున్నందున కుమార్తెల వివాహ కార్యక్రమాలు కూడ ఆమె స్వయంగా చూసుకున్నారు. వివాహం సమయానికి కేవలం అతిథిగా మాత్రమే హజరయ్యి మౌలానా తిరిగి వెళ్ళివలసిన పర్థితులలో కూడ కార్యదక్షతతో ఆమె అన్ని వ్యవహారాలను నిర్వహించారు. ఈ విషయాన్ని మౌలానా ప్రస్తావిసూ, I was too busy to attend anything. So my wife looked after everything as best as she could and I just came in as a wedding guest, అనిపేర్కొన్నారు. (Understanding The Muslim Mind, Rajmohan Gandhi, Penguin Books, New Delhi, 1987, Page. 99).

1921 సెప్టెంబరులో మౌలానా ముహమ్మద్‌ అలీ గాంధీజీ పరివారంతో కలసి కలకత్తా నుండి మద్రాసు వెడుతున్నారు. ఆ పరివారంలో అంజాది బేగం కూడ ఉన్నారు. విశాఖపట్నం రైల్వేష్టేషన్ వద్ద మøలానా ముహమ్మద్‌ అలీ ఆరెస్టయ్యారు. అ సందర్బంగా ఆమె చూపిన ధైర్య సాహసాలు జాతీయోద్యమ నేతల, ప్రజల ప్రశంసకు పాత్రమయ్యాయి.

142