పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారత స్వాతంత్రోద్యమం:ముస్లిం మహిళలు


విశాఖపట్నం రైల్వే పోలీసు స్టేషన్‌లో నిర్బంధంలో ఉన్న భర్తను కలసి ' తన గురించి, కుటుంబం గురించి చింతించాల్సిన అవసరం లేదని ఆయనకు ఆమె ధైర్యం చెప్పారు. మౌలానా అరెస్టు సందర్బంగా గాంధీజీ ఆమెతో మాట్లాడు తూ మౌలానా అరెస్టు సమయంలో భయం కలుగలేదా? అని ప్రశ్నించగా ఆయన తన దేశంకోసం జాతి కోసం జైలుకెళ్ళారు, అని ఆమె ప్రతిస్పందించారని యంగ్ ఇండియాలో గాంధీజీ రాశారు. ఈ సంఘటనలు అంజాది బేగంలోని మొక్కవోని దీక్ష, అసమాన ధైర్య సాహసాలకు రుజువులుగా నిలుస్తాయనటంలో సందేహం లేదు.

1928లో పండిట్ మోతిలాల్‌ నెహ్రూ˙ అధ్యక్షతన రూపొందిన నెహ్రూ కమిటీ రిపోర్టును మౌలానా ముహమ్మద్‌ అలీ అంగీకరించలేదు. ఈ నివేదిక ఢిల్లీ ప్రతిపాదానలకు వ్యతిరేకమంటూ ఆయన విమర్శించారు. ఆ క్రమంలో 1928లో మౌలానా భారత జాతీయ కాంగ్రెస్‌కు మానసికంగా దూరమయ్యారు. ఆయనకు మహాత్మాగాంధీతో కూడ సంబంధాలు సన్నగిల్లాయి. 1930నాటి బొంబాయి సభలో మౌలానా మాట్లాడుతూ మహాత్మా గాంధీ హిందూ మహాసభ మతచాందసుల ప్రబావానికి లోనయ్యారని అభియాగం చేశారు. ఆ సమయంలో వాయువ్య సరిహద్ధు ప్రాంతంలోని కోహ్‌ట్ లో జరిగిన మతకలహాల విషయం మీద గాంధీజీకి మౌలానాకు అభిప్రాయబేధాలు వచ్చాయి. ఆ మతకలహాలకు కారణం ఎవరన్న విషయం మీద ఆ నేతలిరువురికి ఏకాభిప్రాయం కుదరలేదు. ఆ తరువాత క్రమక్రమంగా అలీ సోదరులకు, గాంధీజీకి మధ్య ఎడం బాగా పెరిగింది.

1930లో ప్రదమ రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి ఎంపిక చేసిన ప్రతినిధిగా మౌలానా లండన్‌ వెళ్ళారు. ఆయన వెంట అంజాది బేగం కూడ వెళ్ళారు. ఆ సమయానికి మౌలానా ఆర్థిక పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయి. అంజాది బేగంను తన వెంట తీసుకళ్ళేందుకు నిధులు లేని దుస్థితి ఆ కుంటుంబాన్ని ఆవరించింది. ఖిలాపత్- సహాయ నిరాకరణ ఉద్యమం సందర్భంగా లక్షలాది రూపాయల నిధులను ఉద్యమం కోసం సేకరించి పెట్టిన కుటుంబానికి ప్రయాణ ఖర్చులకు డబ్బులేక ఇబ్బందులు పడాల్సిన దుస్థితి ఎదురయ్యింది. జాతీయ కాంగ్రెస్‌కు దూరం కావటం, నెహ్రూ˙ నివేదికను వ్యతిరేకించటం, మహాత్మా గాంధీతో విభేదించటం వలన ఆయన క్రమంగా జాతీయ కాంగ్రెస్‌ నాయకుల నిరాదరణకు గురయ్యారు. ఆ కారణంగా ఆర్థిక ఇబ్బందులతో

143