పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆదర్శవంతమైన సేవలందించిన మహిళానేత

సుఫియా సోం

జాతీయోద్యమంలో మహిళలు విభిన్నపాత్రలను పోషించారు. జాతీయ కాంగ్రెస్‌ పిలుపు మేరకు ఓర్పు, సహనం,సేవాభావనలకు ప్రతిరూపాలయిన మహిళలు అపూర్వ సేవలందించి, కార్యదక్షతను ప్రదర్శించి ఉద్యమంలో భాగస్వాములయ్యారు. ఈ కోవలో ఆత్మీయ పూర్వకంగా సేవలను అందించటంలో సమర్థ్ధులన్పించుకున్న ప్రముఖ మహిళా నేతగా శ్రీమతి సుఫియా సోం ఖ్యాతిగాంచారు. అఖిల భారత జాతీయ కాంగ్రెస్‌ మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా, సేవాదాళం పర్యవేక్షకురాలిగా, నాయకురాలిగా ఆమె ప్రఖ్యాతి చెందారు.

బొంబాయికి చెందిన సుఫయా సోం గురించి వివరాలు ప్రత్యే కంగా లభించకు న్నా మహాత్మాగాంధీ రాసిన లేఖలు, ' సరిహద్ధు గాంధీ ' ఖాన్‌ అబ్దుల్‌ గపూర్‌ ఖాన్‌ ఆత్మకదలో ఆమె గురించి చేసన ప్రస్తావనలను బట్టి జాతీయోద్యమంలో సుఫయా పాత్ర తెలుస్తోంది. సరిహద్ధు గాంధీ తన ఆత్మకధలో నాతోపాటు నా కుమార్తె మహర్‌ తాజ్‌, అన్నగారి కుమార్తె కుమారి మరియ్యం కూడ వచ్చారు. సుఫియాతో కలసి వాళ్ళంతా మహిళా విభాగంలో సేవలందిస్తూ గడిపారు అని పేర్కొన్నారు.

చిన్న వయస్సులోనే సుఫియా పలుసార్లు జైలుకెళ్లారు. ఈ విషయం బిజనోర్‌

135