పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

బేగం జులేఖా అనారోగ్యం రోజురోజుకు తీవ్రతరమైంది. డాక్టర్ల ప్రయత్నాలు ఫలించలేదు. చివరకు భర్త కడసారి చూపుకు నోచుకోకుండానే 1943 ఏప్రిల్‌ 19న భర్తకు 1500 మైళ్ళ దాూరంలో ఉన్న కలకత్తాలో జులేఖా చివరి శ్వాసవిడిచారు. ఆమె కన్నుమూసిన విషయం తెలిసిన మౌలానా ఆజాద్‌ మా 26 సంవత్సరాల వైవాహిక జీవితం సమాప్తమయ్యింది. మృత్యువు మా మధ్యాన అడ్డుగోడలు నిర్మించింది అంటూ నిస్సహాయంగా విలపించారు.

ఈ విధంగా జీవితాంతం మౌలానాకు మానసిక స్థైర్యాంన్ని కలుగచేస్తూ, ఆయన మనస్సు విముక్తి పోరాటం మీదా లగ్నమయ్యే విధంగా తోడ్పడిన జులేఖా బేగంలోని పట్టుదల, ధైర్యసాహసాలనులను, త్యాగాన్ని ప్రస్తావిస్తూ ఆమె ఎంతో ధైర్యశాలి, నా ఆలోచనల ఆచరణలో ఆమె సహ భాగస్వామి. ఆమె తోడ్పాటు లేనట్టయితే నా రాజకీయ జీవితం అసంపూర్ణంగా మిగిలిపోయేది అని మౌలానా అబుల్‌ కలాం అన్నారంటే ఆయన జీవిత సహచరిణిగా ఆమె ఎంతి మహత్తర పాత్రను నిర్వహించారో అర్థ్ధమౌతుంది.

స్వాతంత్య్రోద్యామంలో బేగం జులేఖా నిర్వహించిన పాత్రను సక్రమంగా అర్థ్దం చేసుకున్నందున ఆనాడు మౌలానాతోపాటుగా దేశమంతా శోకసంద్రమయ్యింది. భారత దేశం యావత్తు ఆమెకు శ్రద్దాంజలి ఘటించింది. ఆది నుండి మౌలానా రాజకీయాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ముస్లింలీగ్ కూడ ఎంతో గౌరవంతో ఆమెకు అంజలిఘటిస్తూ ప్రత్యేక సమావేశం జరిపి సంతాప తీర్మానాలు చేసింది. ఆ తీర్మానాలలో జులేఖా బేగం త్యాగ నిరతిని, లక్ష్యం పట్ల ఉన్ననిబద్ధ్దతను కొనియాడటం విశేషం.

స్వాతంత్య్రోద్యమంలో తాను ప్రత్యక్షంగా పాల్గొనక పోయినప్పటికీ జీవిత భాగస్వామిని విముక్తి పోరాటానికి అంకితం చేసి, భర్తకు నైతిక, మానసిక బలాన్ని అందించి ఆయన దాష్టి స్వరాజ్యమను మహత్తర లక్ష్యం దిశగా సాగేందుకు తోడ్పడి పరోక్షంగా స్వాతంత్య్రసంగ్రామంలో భాగస్వామ్యం అందించి శ్రీమతి జులేఖా బేగం పునీతులయ్యారు.

నా భర్తకు శిక్ష పడినందుకు సంతోషంగా ఉంది. ఆందుకు ఆ ప్రభువుకు నా సాష్టాంగ ప్రణామములు. ఆయన మార్గంలోనే నేనూ నడుస్తా. ఆ కంటక ప్రాయమెన మార్గంలో సాగి నా ప్రాణాలను బలివ్వడానికి కూడ నేను సిద్ధం. - సాదాత్‌ బానో కిచ్లూ

134