పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

నుండి ప్రచురితమైన మదీనా అను ఉర్దూ వార్తాపత్రికలోని వార్తల ద్వారా తెలుస్తోంది. ఆ పత్రిక 1932 మార్చి 12 నాటి సంచికలో, బొంబాయికి చెందిన సుప్రసిద్ధ మహిళా నాయకురాలు కుమారి సుఫియా సోం జైలు నుండి విడుదలయ్యారు. ఆమెను బొంబాయి వదలి వెళ్లవలసినదిగా ఉత్తర్వులు జారీ అయ్యాయి అని రాసింది. 1932 మే ఒకటి నాటి సంచికలో హిందాూస్తాన్‌ సేవాదళం నాయకురాలు సుఫియా సోంను పోలీసులు అరెస్టు చేశారు అని రాసింది. ప్రజలను చైతన్యవంతుల్ని చేసి సంఘటితపర్చగల సత్తా కలిగిన నాయకురాలు కావడంతో ఆమెను బొంబాయి నగరం నుండి ప్రభుత్వం బహిష్కరించింది. ఈ వార్తలు, విశేషాలను బట్టీ సుఫియా సోం బ్రిటిష్‌ వ్యతిరేక పోరాటాలలో చురుగ్గా పాల్గొంటూ క్రమక్రమంగా ప్రముఖ నాయకురాలి స్థానానికి ఎదిగినట్టు తెలుస్తుంది.

జాతీయోద్యమ కార్యక్రమాలలో పాల్గొంటున్నప్పుడే, ఖాన్‌ అబ్దుల్‌ గఫూర్‌ ఖాన్‌ సోదరుడు డాక్టర్‌ ఖాన్‌సాబ్‌ కుమారుడు ఖాన్‌ సాదుల్లా ఖాన్‌ను సుఫియా సోం వివాహం చేసుకున్నారు. సాదుల్లాఖాన్‌ బొంబాయి కార్పొరేషన్‌లో ఇంజనీర్‌ మాత్రమే కాకుండా, నాన్న, చిన్నాన్నలాగే స్వాతంత్య్ర సమరయాధుడు. ఈ విషయాన్ని మహాత్మాగాంధీ 1935 జనవరి 26నాి తన లేఖలో ప్రస్తావిసూ, వివాహం తరువాత భర్త ప్రోత్సాహంతో సుఫియా తన ఇష్టానుసారం దేశంకోసం మరింత బాగా సేవలందించగలదు, అని ఆశాభావం వ్యక్తంచేశారు. ఆమె వివాహం రోజున తన వ్యక్తిగత కార్యదర్శి మహాదేవ దేశాయి ద్వారా రాయించిన లేఖలో గాంధీజీ నూతన వధూవరులకు ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపారు.

సుఫియా సోం భర్త సాదుల్లా ఖాన్‌ మాత్రమేకాకుండ, ఆయన కుటుంబీకులంతా స్వాతంత్య్ర సమరయోధులు కావటంతో, గాంధీజీ రాసినట్టు ఆమె జాతీయోద్యమంలో మరింత చురుకుగా పనిచేయడానికి చక్కని ప్రోత్సాహం లభించింది. ఖాన్‌ అబ్దుల్‌ గపార్‌ ఖాన్‌ పలు లేఖలలో ఆమె కార్యక్రమాల గురించి వాకబు చేయటం ద్వారా, ఆయా విషయాలను ఆ లేఖలలో ప్రస్తావించడాన్ని బట్టి శ్రీమతి సోఫియా సోం దేశభక్తి జాతి జనుల పట్లగల సేవానురక్తి వ్యక్తమౌతుంది.

136