పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

గుజరాత్‌ మహిళల సమావేశం ఏర్పాటు చేస్తున్నాను. ఆ సమావేశానికి నీవు, మీ అమ్మగారు తప్ప క హాజరుకావాలి అని కోరారు. స్వయంగా మహాత్ముడు పంపిన ఆహాfiనానిfl గౌరవిస్తూ అమీనా సమావేశానికి హజరయ్యారు. ఆ సమావేశంలో గాంధీజీ సమక్షంలో గుజరాత్‌ మహిళా కాంగ్రెస్‌ అధ్య క్షు రాలిగా అమీనా తయ్యాబ్జీ ఎంపికయ్యారు. మద్యపాన నిషేధం, విదేశీ వస్తువుల బహిష్కరణ కోసం కృషిచేయాలని నిర్ణయిస్తూ ఆ సమావేశం తీర్మానించింది.

ఆ నిర్ణయాల మేరకు గుజరాత్‌ మహిళా కాంగ్రెస్‌ నేతగా అమీనా తయ్యాబ్జీ అన్ని కష్టనష్టాల కోర్చి మద్యపాన నిషేధం, విదేశీ వస్తువుల బహిష్కరణోద్యామానికి ప్రాణం పోశారు. గుజరాత్‌ అంతటా ధర్నా, పికెటింగ్, రాస్తారోకో లాంటి ఆందోళనా రూపాలతో ఉద్యమించి భారతదేశం మొత్తానికి గుజరాత్‌ను ఆదర్శప్రాయమైన మార్గంలో నిలిపారు. విదేశీ వసువుల బహిష్కరణకు ప్రత్యామ్నాయంగా ఖధరు వస్రదారణను ప్రోత్సహించారు. రాట్నం తిప్పటం, నూలు వడకటం, ఖద్దరు నేయటం, ఖద్దరు ధారించడాన్ని స్వయంగా ఆచరించి ఆయా కార్యక్రమాలకు బహుళ ప్రాచుర్యం కల్పించారు.

ఆమె కృషి, కార్యదక్షతను గమనించిన గాంధీజీ తన యంగ్ ఇండియా, నవజీవన్‌ పత్రికలలో తగిన తీర్మానం చేసి గుజరాత్‌ మహిళలు మహత్తరమైన బాధ్యతను స్వీకరించారు. ఆ బరువును మహిళల పక్షాన అమీనా తయ్యాబ్జీ ఆమె కమిటీ భరించారు అని ప్రశంసించారు. ఈ ఉద్యమం నేపధ్యంలో మహిళా కాంగ్రెస్‌ పక్షాన వైశ్రాయికి పంపిన లేఖలో 24 మంది మహిళల సంతకాలతో పాటుగా అమీనా తయ్యాబ్జీ సంతకాన్ని కూడ గాంధీజీ కోరడం ద్వారా జాతీయ స్థాయిలో ఆమె ప్రాధాన్యత వెల్లడయ్యింది. ఆ లేఖలో ఆమనా ఖురేషి, రెహనా తయ్యాబ్జీలు కూడ సంతకాలు చేశారు.

చివరివరకు జాతీయోద్యమంలో పాల్గొని, మహాత్ముని అడుగుజాడల్లో ఆమె నడిచారు. బాధ్యత స్వీకరించిన కార్యక్రమాలన్నిటినీ దీక్షాదక్షలతో నిర్వహించి ఉద్యమకారులకు ఆదర్శంగా నిలచిన శ్రీమతి అమీనా తయ్యాబ్జీ 1942లో కన్నుమూశారు.

(Collected Works of Mathama Gandhi, Govt. Of India Publications, New Delhi and Family, Kinship and Marriage among Muslims in India, Prof. Imthiaz Ahamed, Manohar, 1976)

122