పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గాంధీజీ ఆహ్వానం మేరకు నాయకత్వ బాధ్యతలు స్వీకరించిన

అమీనా తయ్యాబ్జీ

(1866-1942)

బ్రిటిషు వ్యతిరేక పోరాటాలలో భాగంగా సాగిన సంస్కరణోద్యమాలలో ఆనాడు మహిళలు చురుగ్గా పాల్గొన్నారు. ఆ కార్యక్రమాలలో నిబద్ధతతోపాటుగా ఎంతో కార్య దక్షతను ప్రదర్శించారు. ఆ కారణంగా సమర్థత గల అటువంటి మహిళలను మహాత్మా గాంధీ స్వయంగా ఆహ్వానించి వారికి నాయకత్వపగ్గాలను అందించారు. అంతటి మహాత్తర గౌరవాన్ని దాక్కించుకున్న మహిళలలో అగ్రగణ్యులు బేగం అమీనా తయ్యాబ్జీ.

అమీనా తయ్యాబ్జీ గుజరాత్‌కు చెందిన ప్రసిద్ధ తయ్యాబ్జీల కుటుంబంలో 1866లో జన్మించారు. జాతీయ కాంగ్రెస్‌ నాయకులు జస్టిస్‌ బధ్రుద్దీన్‌ తయ్యాబ్జీ ఆమె తండ్రికాగా జస్టిస్‌ అబ్బాస్‌ తయ్యాబ్జీని ఆమె వివాహం చేసు కున్నారు. ఆ కుటుంబంలో ఉన్న రాజకీయ వాతావరణం మూలంగా అమీనా చిన్ననాటి నుండే స్వాతంత్య్రోద్యమం పట్ల ఆకర్షితురాలయ్యారు. ఆమె మొదటి నుండి ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ సభ్యురాలు. అమీనాలో గల పట్టుదల గుజరాత్‌ మహిళలలో ఆమెపట్ల ఉన్న గౌరవాన్ని గమనించిన గాంధీజీ 1930 ఏప్రిల్‌ 11న ఆమె కుమార్తె రెహనా తయ్యాబ్జీ పేరిట ఓ లేఖ రాస్తూ మధ్యాపాన నిషేధం, విదేశీ వస్తువుల బహిష్కరణ తదితర అంశాల మీద

121