పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారత స్వాతంత్రోద్యమం:ముస్లిం మహిళలు


ప్రొఫెసర్‌ టి.జ్యోతిరాణి, M.A.,Ph.D.. కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్‌

స్నేహ వాక్యం

అసమ సంబంధాలు పునాదిగాగల రాజకీయార్థిక నిర్మాణాలను ప్రగతి శీలంగా మలచుకొనానికి, ప్రజాస్వామికం చేసుకొనానికి తలఎత్తిన ఉద్యమా లైనా, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పరాయిపాలన నుండి దేశాన్ని విముక్తం చేసుకొనటానికి నిర్మించబడ్డ స్వాతంత్య్రోద్యమాలేనా అవి ఉనికిలోకి వచ్చి ఆశించిన లక్ష్యాలను సాధించటానికి ఆకాశంలో సగం అయిన స్త్రీల పరోక్ష, ప్రత్యక్ష భాగస్వామ్యం అనివార్యం. కానీ పితృస్వామిక భావజాలం స్త్రీని ఒక స్వతంత్ర వ్యక్తిగా చూడానికి నిరాకరిస్తుంది. స్త్రీపురుషుల మధ్య అధీనత్వ- ఆధిపత్య సంబంధాలు పునాదిగా నిర్మించబడిన పితృస్వామిక కుటుంబంలో ఇంటికే పరిమితం చేయబడిన స్త్రీ ఇంటిని నిర్వహించానికి తన జీవితకాలమంతా నిర్విరామంగా, నిరంతరాయంగా శ్రమ చేస్తున్నప్పటికీ ఆ పనికి విలువ లేదు , గుర్తింపురాదు. అదే విధగా భారతదేశ స్వాతంత్య్ర ఉద్యమంలో స్రీల చురుకైన భాగస్వామ్యం, క్రీయాశీలక పాత్ర గుర్తింపుకు రాకుండ, అదాశ్యంగా మిగిలిపోయే ప్రమాదా వున్నది. ఇటువంటిస్థితి ముస్లిం స్రీల విషయంలో మరింత తీవ్రమయ్యే అవకాశ మున్నది. స్వాతంత్య్ర సంగ్రామంలో ముస్లిం స్త్రీలు చురుకైన భాగస్వామ్యం వహించారన్నది ఒక చారిత్రక వాస్తవం. ఈ సత్యాన్నివెలికి తీయానికి జెండర్‌ చైతన్య స్పృహ, చిత్తశుద్ధి, నిబద్ధతలతో కూడిన కృషి, విభిన్నపధతులద్వారా స్త్రీల భాగావామ్యానికి సంబంధించిన సమాచారసేకరణ అవసరమవుతాయి. ఈ విధమైన కృషి శ్రీ సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ రాసిన భారత శ్వాఆతంత్య్రోద్యమం- ముస్లిం మహిళలు పుస్తకంలో వ్యక్తమవుతుంది.

స్వాతంత్య్రోద్యమాన్నీ జనబాహుళ్య ఉద్యమంగా (Mass Movement) బలో పేతం చేసే క్రమంలో గాంధీజీ పిలుపు మేరకే స్త్రీల భాగస్వామ్యం చోటు చేసు కున్నదనే భావన తప్పని ఈ పుస్తకంలో పొందుపరచబడిన 61 మంది ముస్లిం స్రీల పాత్రలను పరిశీలించినట్లయితే బోధపడుతుంది. 1857 నుండి 1947 వరకు

9