పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌నశీర్‌అహమ్మద్‌

అంటే ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలనకు వ్యతిరేకంగా తలెత్తిన ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం నుండి సంపూర్ణ స్వాతంత్య్రం వచ్చేవరకు నిర్మించబడిన వివిధ ఉద్యామాలలో, ఆ తరువాత సాగిన ప్రజా ఉద్యమాలలో కూడ ముస్లిం మహిళలు గుణాత్మకంగా విలక్ష ణమైన పాత్ర నిర్వహించారన్న వాస్తవం తెలుస్తుంది. స్వతంత్రభారత నిర్మాణంలో వారి స్థానం స్పష్టమవుతుంది. స్రీలుగా పితృ స్వామిక సమాజంలో,ముస్లింలుగా భారతదేశంలో పరాయీకరణకు గురవుతున్న వర్తమాన సందర్భంలో ఈ పుస్తకం ఆహ్వానించతగింది.

భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ముస్లిం స్త్రీలు స్వాతంత్య్ర పోరాటంలో అధికంగా పాల్గొనటం గమనించవచ్చు. ప్రదమ స్వాతంత్య్ర సంగ్రామం లో పాల్గొన్న ముస్లిం స్త్రీలలో బేగం హజరత్‌ మహల్‌ మినహాయించి పోరుబాటన నడిచిన మిగిలిన వారందరూ సాధారణ కుటుంబాలకు చెందినవారే. దాదాపు నూటయాభై సంవత్సరాల క్రితమే పరాయిపాలనను వ్యతిరేకించి, తిరగబడి, ఉరిశిక్షలకు కూడ ఏమాత్రం భయపడకుండ ఎదురు నిలిచిన వీరవనితలు వీరు.

స్వాతంత్య్ర సాధనకు రూపుదిద్దుకున్న విభిన్న పోరాట మార్గాలు- అహింసా యుత మార్గం కావచ్చు, సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించే వామపక్ష మార్గం కావచ్చు గెరిల్ల యుధమే మార్గం కావచ్చు- అన్ని పోరాట మార్గాలలో ముస్లింస్రీల భాగస్వామ్యం ఉండటం గమనించవలసిన విషయఒ ఖిలాఫత్‌ ఉద్యమం ద్వారా జాతీయోద్యమంలో ప్రవేశించి సహాయనిరాకరణ, విదేశీవస్తు బహిష్కరణ, క్విట్ఇండియా మొదలైన అన్నిపోరాట రూపాలలో ముస్లిం స్త్రీల చురుకైన భాగస్వామ్యం కనిపిస్తుంది.ఈ ముస్లిం స్త్రీలు సంపన్న కుటుంబాల నుండి సాధారణ కుటుంబాల వరకు చెందినవారు. దక్షిణాఫ్రికాలో సంపదను, వ్యాపారాలను త్యజించి భారత దేశానికి వచ్చి పాల్గొన్న కుటుంబాలు కొన్నికాగా స్వదేశంలోనే ఆస్తులను, పదవులను, ఉద్యోగాలను, వ్యాపారాలను వదలుకొని జాతీయోద్యామంలో పాల్గొన్న కుటుంబాలు మరికొన్ని ఇటువంటి నేపథ్యం గల కుటుంబాలకు చెందిన ముస్లిం మహిళలు చాలావరకు ఉన్నత విద్యను అభ్యసించినవారే. బాల్యం నుండే బ్రిీటిష్‌ పాలననువ్యతిరేకించినవారే.

మునీరా మజ్రుల్‌ హఖ్‌, అమీనాతయ్యబ్జీ, మజీదా హసీనా బేగం మొదలైనవారు జాతీయోద్యమంలో ప్రత్యక్షంగా భాగస్వాములు. కాగా రజియాఖాతూన్‌ మొదలైనవారు పరోక్షంగా ఉద్యమానికి తోడ్పడ్డారు. వాస్తవానికి ప్రత్యక్ష పరోక్ష

10