పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

దృఢదీక్షను తెలియజేస్తూ ఆయనకు సంబంధించిన వ్యవహారాల మీద వ్యాఖ్యానిస్తూ పలువురు ప్రముఖులకు ఆమె ఉత్తరాలు రాశారు. 1916 ఏప్రిల్‌ 11న మౌలానా అబ్దుల్‌ బారికి లేఖ రాస్తూ, మౌలానాకు భగవంతుడు మరింత సంకల్పబలం ఇవ్వాలి. ఏం జరుగుతుందో చూద్దాం. ఒక వేళ జైలు శిక్ష పడినా ధైర్యంగా ఉండాలి...నేను కూడ జైలుశిక్షకు గాని ఉరిశిక్షకు గాని బలవ్వడానికి సిద్ధ్దంగా ఉండాలి, అని ప్రకటించారు. మౌలానా మోహాని లలిత్‌పూరు జైలులో ఉండగా, ఆయనకు 1916 ఏప్రిల్‌ 28న రాసిన లేఖలో ఎవడైతే జులుం చేస్తాడో వాడు కత్తికి బలవుతాడు. మనం జులుం చేయం. మన మీద జులుం సాగుతున్నందుకు సంతోషిద్దాం అని ఆమె రాశారు.

మౌలానా మోహాని నిర్బంధంలో ఉండగా ఆమె చూపిన చొరవ, కార్యదక్షత, సమయస్పూర్తి, దేశభక్తిని కొనియాడుతూ మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌,మౌలానా అబ్దుల్‌ బారి ఫిరంగి మహాల్‌, మౌలానా ష్ధకత్‌ అలీ, మౌలానా ముహమ్మద్‌ అలీ, ఆబాది బానో బేగం తదితర ప్రముఖులు ఆమెకు లేఖలు రాయగా మహాత్మా గాంధీ ఆమె ధైర్యసాహసాలను ప్రశంసిస్తూ తన పత్రికలలో ప్రత్యేక కధానాలు ప్రచురించారు.

జాతీయ స్థాయిలో బేగం నిశాతున్నీసాకు లభించిన గుర్తింపు గౌరవం ఎలా ఉన్నా ఇంట్లో మాత్రం భయంకర దుర్బర పరిస్థితు లను ఎదుర్కోవాల్సివచ్చింది. ఆనారోగ్యం, పోలీసుల వేధింపులు, పేదరికం ఆ కుటుంబాన్నిపట్టి పీడించసాగాయి. ఆ సమయంలో ఆమె ఇంట దొంగతనం కూడ జరిగింది. ఆ దొంగతనంతో ఆ కుటుంబం ఆర్థికంగా మరింత కునారిల్లిపోయింది. కుటుంబం ఎంతి ఆర్థిక అవసరాలతో అల్లాడుతున్నా ఆమె మాత్రం ఆత్మగౌరవానికి ఏమాత్రం భంగం కలుగనివ్వలేదు.

ఆ కుటుంబం పరిస్థితు లు తెలుసుకున్న మౌలానా సన్నిహిత మిత్రులు, హిందూస్థాన్‌ పత్రిక సంపాదకులు, జాతీయ కాంగ్రెస్‌ నాయకులు పండిత కిషన్‌ ప్రసాద్‌ కౌల్‌ 1916 -17లో అలీఘర్‌ వచ్చారు. ఆ సమయంలో మౌలానా ఇంటి పరిస్థితులను స్వయంగా చూసిన ఆయన ఆమెకు ఆర్థిక సహకారం అందించదలిచారు. ఈ విషయాన్ని సంశయిస్తూ ఆమెవద్ద ప్రస్తావించారు. ప్రజల నుండి చందా వసూలు చేసి ఆమెకు పంపగలనన్నారు. ఆ మాట విన్నంతనే మేము ఎలా ఉన్నామో అలాగే ఉండడానికి సంతోషిస్తున్నాం...మా బరువును ఇతరుల మీద వేయటం సరికాదు. మా విషయం గురించి ఆలోచించ వద్ధు.. మౌలానా ప్రచురించిన సాహిత్యం చాలా పడిఉంది. మీకు వీలైనట్టయితే ఆ గ్రంథాలను

116