పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారత స్వాతంత్యోద్యమం ముస్లిం మహిళలు


విక్రయించి సహకరించండి. ప్రజల నుండి చందాల వసూలు మాత్రం వద్దుదాు అని ఆమె సున్నితంగా పండిత్‌ కౌల్‌ అభ్యర్థనను నిరాకరించారు.

ఈ విధంగా ఆత్మాభిమానానికి ఏమాత్రం విఘాతం కలుగనివ్వకుండా కష్టనష్టాలను చిరునవ్వుతో స్వాగతిస్తూ ముందుకు సాగే ఉత్తమగుణసంపదతో బేగం నిశాతున్నీసా ఆచరణాత్మక ఉద్యమకారిణిగా జాతీయ స్థాయిలో ఖ్యాతి గడించారు. ప్రజలలో గౌరవాభిమానాలను సంతరించుకున్న ఆమె ప్రముఖ స్వాతంత్య్రసమరయోధుల సరసన నిలిచారు. ఆనాడు సరోజిని నాయుడు, అనిబీస్వ్ంట్, ఆబాది బానో బేగం తదితరులు గల భారతీయ మహిళా కాంగ్రెస్‌ ప్రతినిధిమండలిలో స్థానం పొందారు.

ప్రముఖ మహిళల ప్రతినిధి బృందంలో సభ్యురాలిగా ఆమె 1917లో మాంటేగ్ ను కలిశారు. ఆ సందర్భంగా బ్రిటిషు ఉన్నతాధికారి సమక్షంలో ఆమె చూపిన తెగువ ఆమెలోని పోరాటయోధాురాలిని మరోమారు బహిర్గతం చేసింది. విచారణ లేకుండ పోలీసుల నిర్భంధంలో మగ్గుతున్న, ఆంక్షల వలయంలో చిక్కుకుని బాధలు పడుతున్న ఉద్యమకారుల పక్షాన భారతీయ మహిళా కాంగ్రెస్‌ ప్రతినిధిమండలి సభ్యురాలిగాఆమె మాట్లాడారు. ఐర్లండులోని విప్లవకారులను విడుదల చేస్తున్న మీరు నిర్బంధంలో ఉన్న భారతీయ యోధులకు ఎందుకు స్వేచ్ఛనివ్వరని బ్రిటిష్‌ ప్రభుత్వ కార్యదర్శి మాంటేగ్ ను ప్రశ్నిస్తూ జాతీయోద్యమకారుల విడులను డిమాండ్‌ చేసిన తీరు ఆమెలోని నిర్భీతికి నిదర్శనంగా నిలచింది.

1918 మేలో హసరత్‌ మోహాని జైలు నుండి విడుదలయ్యారు. గృహనిర్భంధ ఉతర్వులు మాత్రం అలాగే కొనసాగుతున్నాయి.ఆ ఆంక్షలను ఆయన నిరాకరిస్తూ వాివాటిని ఉల్లంఫిుంచారు. ఆ కారణంగా మీర్‌, మోహాన్‌ తదితర ప్రాంతాలలో ఆంక్షలతో కూడిన నిర్భంధాన్నిమౌలానా చవిచూడల్సి వచ్చింది. ఈ విషయమై నిశాతున్నీసా బేగం భర్త పక్షాన న్యాయపోరాటం సాగించారు. ఆ పోరాటం ఫలితంగా చివరకు డిసెంబరు మాసంలో మౌలానాకు పూర్తిగా స్వేచ్ఛ లభించింది. ప్రబుత్వం విధించిన ఆంక్షలు తొలగగానే నిశాతున్నీసాతో కలసి మౌలానా ఖిలాఫత్‌ ఉద్యమంలో చురుగ్గా భాగస్వాములయ్యారు.

1920 డిసెంబరులో ఆరంభమైన సహాయనిరాకరణ ఉద్యమంలో మౌలానా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బేగం నిశాతున్నీసా క్రియాశీలక పాత్ర నిర్వహించారు. హిందూ, ముస్లింల ఐక్యతను కాంక్షిస్తూ ఆమె ప్రచార కార్యక్రమాలను ఉదృతం చేశారు.

117