Jump to content

పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం ప్రజా పోరాటాలు.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

సయ్యద్ నశీర్ అహమ్మద్ 30

తిరుగుబాటు వేదిక మీద కన్పించారు. ఎవరు ఏ విధంగా రంగం మీదకు వచ్చినా అందరూ ఫిరంగీల పెత్తనం నుండి జన్మభూమిని విముక్తం చేయటం, కంపెనీ పాలకుల, ఆ పాలకుల తొత్తుల పీడన నుండి ప్రజలకు రక్షణ కల్పించటం, వడ్డీ వ్యాపారులు, జమీందారుల దోపిడీని నిరోధించటం ప్రధాన లక్ష్యాలుగా నిర్దేశించుకుని పోరుబాటన సాగారు. ఐక్యంగా పోరాటం సాగినప్పటి కంటే కంపెనీ బలం మరింత పెరిగిన తరువాత, ఫకీర్ల బలగాలు తగ్గటంతో ఫకీర్ల ఉద్యమం వరుస పరాజయాలను చవిచూడాల్సి వచ్చింది. ప్రధానంగా రంగాపూర్, మైమ్సంగ్ ప్రాంతాలలో జరిగిన పోరాటాలు ఫకీర్లను నిర్వీర్యులను చేశాయి. ఈ పరిస్థితులలో నాయకత్వం లక్షణాలు గల నేతలు వేర్వేరు దళాలను ఏర్పాటు చేసుకున్నారు. పరిమిత శక్తియుక్తులతో తమ పరిధులలో ఫిరంగీల మీద పోరాటం సాగించారు.
చిరాగ్ అలీ, ఫిరాగ్ అలీల తరువాత అదే విధంగా రాంజానీ షా, జహరి పాల జంట ఉనికిలోకి వచ్చింది. ఈ జంట అస్సాం వైపుగా సాగి అక్కడ తమ స్థావరాలను ఏర్పర్చుకుంది. అయితే ఈ దళంలో కూడా అంతర్గత సంఘర్షణలు మితిమీరటం వలన కంపెనీ బలగాలదే పైచేయి అయ్యింది. ఈ ప్రతికూల పరిస్థితులలో కూడా సాహసులైన ఫకీర్లు పలు దళాలలను నిర్మించారు. ఆ దళాలకు పటిష్టమైన స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. అయినా మునుపటి శక్తిసామర్థ్యాలను ఫకీర్లు కోల్పోయారు.
ఈ వాతావరణం కంపెనీ పాలకులకు ఉత్సాహం కలిగించింది. మజ్నూ షా తరువాత భారీ బలగాలతో ఫకీర్లు దాడులు జరిపిన సంఘటనలు పెద్దగా లేనప్పటికీ దశాబ్దాల తరబడి తమ అధికారాన్ని సవాల్ చేయటాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ, సహంచలేకపోయింది. అంతకు ముందు ఇచ్చిన అధికారాల కంటే మరింత తీవ్ర చర్యలతో ఫకీర్లను, సన్యాసులను అణచివేయటానికి అధికారులకు కంపెనీ స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. తిరుగుబాటు అణచివేతకు భారీగా బలగాలను రంగంలోకి దించింది. ఒకవైపు కంపెనీ తన పూర్తి శక్తి సామర్ధ్యాలతో ముందుకు రాగా, ఫకీర్ల-సన్యాసుల ఉద్యమం అంతర్గత సమస్యలతో, విచ్ఛినమైన ఐక్యతతో, చిన్న చిన్న దళాల స్థాయికి చేరి అంతిమ ఘడియలను లెక్కపెట్టసాగింది. ఈ నూతన పరిణామాల వలన కంపెనీ బలగాలను ఎదుర్కోవడానికి తగినంత శక్తి, సామర్థ్యం నాయకులలో లేకపోవడంతో ఫకీర్ల స్థావరాలన్నీ త్వరితగతిన కంపెనీపరమైపోయాయి.
1987లో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రచురించిన INDIA'S STRUGGLE FOR FREEDOM - An Album లో, ఆ నాడు కంపెనీ బలగాలు, అధికారులు జరిపిన కిరాతక చర్యలను రచయితలు ఈ విధంగా వివరించారు.'...గ్రామాలను తగులబెడ్తూ ప్రజలను అడ్డంగా నరికివేస్తూ, ఫకీర్ల- సన్యాసుల తిరుగుబాట్లను అణచి వేయడానికి, బ్రిటీషర్లకు కనీసం ఒక దశాబ్దం పట్టింది... ( ..It took the British at least a decade of buming villages and slaughtering the people before they could sup- press the uprisings..). ఫకీర్లు - సన్యాసుల తిరుగుబాటులో ప్రధాన పాత్ర వహించిన మజ్నూ షా ఫకీర్, చిరాగ్ అలీ షా, మూసా షా అలీ, శోభన్ అలీ షాల మార్గంలో పోరుబాటును ఎన్నుకుని, చరిత్రలో చిరస్మరణీయమైన ఖ్యాతిని గడించిన కరీం షా ఫకీర్,