31 భారత స్వాతంత్య్రోద్యమం-ముస్లిం ప్రజాపోరాటాలు
రోషన్ అలీ, ఇమాం బక్ష్ మర్దూం షా జలాల్, మోతీపుల్లా తదితరులు చరిత్ర పుటలలో
అంతర్ధానమయ్యారు. ఈ నేతలంతా ఫకీర్ల మహసేనాని మజ్నూ షా బాటన నడిచి
తిరుగుబాటు ఉద్యమాలకు ప్రాణాలు పోసి మరణాన్ని ఆనందంగా కౌగిలించుకున్న యోధులు.
ఈ విధంగా ఫిరంగీలకు వ్యతిరేకంగా, భారత స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలో
తొలి తిరుగుబాటు పతాకాన్ని ఎగురవేసిన ఘన చరిత్రను సృష్టించుకున్న ఫకీర్ల తిరుగుబాట్లు
సమసిపోయాయి. నాలుగు దశాబ్దాలపాటు సాగిన ఈ పోరాటాలు, భారత స్వాతంత్య్ర
సంగ్రామంలో చోటు చేసుకున్న అన్ని రకాల విముక్తి పోరాటాలకు, వీర కిశోరాలకు
స్ఫూర్తిదాయకమయ్యాయి. ఈస్ట్ ఇండియా కంపెనీ పెత్తనాన్ని సవాల్ చేసి దశాబ్దాల పాటు
నిలచి పోరాడిన ఫకీర్ల ఉద్యమం గురించి గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్స్ రాసుకున్న
స్మృతులలో ప్రస్తావిస్తూ, యాభైవేలకు పైగా గల తిరుగుబాటుదారులను అణచివేసేందుకు
కంపెనీ సాగించిన ప్రయత్నాలలో పలువురు ఆంగ్లేయాధికారులను, అనేక కంపెనీ సాయుధ
బలగాలను కోల్పోటం, అనేక పరాజయాలను చవిచూడటం జరిగిందని పేర్కొన్నాడు.
ఈ పోరాటాలు చివరకు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను కోరుకుంటూ భారతీయులు
సాగించిన సుదీర్ఘ విప్లవ పోరాటాలకు ఆదర్శమయ్యాయని Dr. Santimoy Ray తన Free-
dom Movement and Indian Muslims లో ప్రశంసించాడు. ఫకీర్ల - సన్యాసుల
తిరుగుబాట్లు విఫలం చెందినప్పటికీ, పందొమ్మిది, ఇరవై శతాబ్దాలలో సాగిన స్వాతంత్య్ర
సంగ్రామం మీద, ప్రధానంగా వహాబీలు, తీవ్రవాదులుగా పిలువబడిన అగ్నియుగం నాటి
విప్లవకారుల మీద చెరగని ముద్రలు వేసిందన్నారు. ( Inspite of its falilure the revolt of
the Fakirs and Sanyasis left an indelible imprint upon the future struggle for
freedom during the nineteenth and twentieth centuries, particularly upon the
Wahabis and revolutionaries of Agni Yug-known as terrorists). నాలుగు దశాబ్దాల
పాటు బ్రిటీష్ సైన్యాలను ఉరుకులు పరుగులు పెట్టించి, కంపెనీ పాలకులను తొడగొట్టి
సవాల్ చేసిన ఫకీర్ల-సన్యాసుల పోరాటాలను ప్రముఖ చరిత్రకారుడు డాక్టర్ తారాచంద్ '...
పర్యవసానం ఎలాగున్నా అనేక సంవత్సరాలపాటు తమ ప్రభావాన్ని చూపాయి...'
అంటూ ఆ పోరాటాల ప్రాధాన్యతను వెల్లడించారు.
1810లో లార్డ్ మింటో ఈ తిరుగుబాట్లను ప్రస్తావిస్తూ,, ".. In truth the sirdars
or captains of the band were esteemed and even called the Hakim or Ruling
Power, while the Government did not possess either authority or influence enough
to obtain from the people the smallest and towards their own protection..", అని
ఆనాటి ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన దుస్థితి మీద వ్యాఖ్యానించాడు. ఫిరంగీల దాస్యం
నుండి భరతభూమిని విముక్తం చేయడానికి సాగిన సుదీర్ఘ స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలో
తనదంటూ ప్రత్యేక స్థానాన్ని సుస్థిరం చేసుకుని, మహత్తర లక్ష్య సాధనా దిశగా సాగిన
వహబీల, ఫరాజీల పోరాటాలకు స్పూర్తిగా, పోరాట వీరులకు ప్రేరణగా నిలచిన ఫకీర్ల -
సన్యాసుల తిరుగుబాట్ల చరిత్ర నాలుగు దశాబ్దాల తరువాత 1800లో ముగిసింది.