తన మనుషులను చిరాగ్ అలీ అగౌరవపర్చారంటూ ఆగ్రహించిన మోతీసింగ్ గిరి, ఆ
రాత్రికి రాత్రే చిరాగ్ అలీ దళాల మీద దాడిచేసాడు. ఆ దాడిలో చిరాగ్ అలీ షా హతమయ్యాడని
కంపెనీ అధికారుల రికార్డులు వెల్లడిచేసాయి.
చిరాగ్ అలీ హత్యతో మజ్నూ షా కాలంలో ఫకీర్లు-సన్యాసుల మధ్య ఏర్పడిన
పటిష్టమైన సంబంధాలలో పగుళ్ళు కన్పించి క్రమక్రమంగా బలహీన పడ్డాయి. సన్యాసుల
నాయకులు జమీందారులకు రుణసౌకర్యం కల్పించటం, ఆ బకాయిల వసూలు విషయంలో
కఠినంగా వ్యవహరించటం, తదితర చర్యల వలన ఆనాటి ఐక్యత, ఉమ్మడి పోరాటాలు,
ఉమ్మడి లక్ష్యాల వాతావరణం కనుమరుగైపోయింది.
ఐక్యత కోసం యత్నించిన శోభన్ అలీ షా
చిరాగ్ అలీ తరువాత ఆ స్థాయి కలిగిన నాయకుడు శోభన్ అలీ షా. మజ్నూ షా
చూపిన మార్గాన పోరుబాటన నడిచిన శోభన్ అలీ తనదైన చిన్న దళాన్ని
ఏర్పాటుచేసుకున్నారు. ఆయన ప్రధానంగా కంపెనీ కచ్చేరీల మీద దాడులు జరిపారు.
చిరాగ్ అలీ మరణం తరువాత కకావికలైన ఫకీర్ యోధులను ఒకచోట చేర్చి పోరుబాటన
నడిపించేందుకు, ఫకీర్లు-సన్యాసుల మధ్యన కనుమరుగైన ఐక్యతను పునరుద్ధరించేందుకు
విశేష కృషి సల్పారు. బాధిత ప్రజలు, ప్రధానంగా రైతుల పక్షాన పలు పోరాటాలు
సాగించారు. ఈ కృషిలో శోభన్ అలీ షాకు అముదీ షా, పీరుగుల్లా షా, మోతిపుల్లా, నేగూ
షా, బుద్ధూ షా, ఇమాం షా, తదితరులు సహకరించారు. బలగాలను సమీకరించుకున్నాక
శోభన్ అలీ కంపెనీ కచ్చేరీల మీదనే కాకుండా, స్వదేశీ వర్తకాన్ని నాశనం చేసిన కంపెనీ
వాణిజ్య సంస్థల మీద దాడులు జరిపారు.
1794లో రాంగంజ్ వాణిజ్య సంస్థ మీద దాడిచేసి ఆరువేల రూపాయల నగదును,
నలుగురు సిపాయిలను ఖైదీలుగా ఫకీర్లు తీసుకుపోయారనీ కంపెనీ అధికారులు పేర్కొన్నారు.
శత్రువు ఇంటనే గూఢచర్యం జరపాలన్న ఎత్తుగడలతో శోభన్ అలీ స్వదేశీయులైన కంపెనీ
అధికారులను వశం చేసుకుని ఫకీర్లకు వ్యతిరేకంగా కంపెనీ పాలకులు తీసుకునే నిర్ణయాలను
ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, అందుకు అనుగుణంగా ఎత్తులు వేస్తూ కంపెనీ బలగాలను
చిత్తు చేసారు. శోభన్ అలీకి సహకరించిన మిత్రుడు శ్రీ దేవ్ సింగ్ ద్వారా ఈ రహస్యం
1774లో బహిర్గతమైంది. అనంతర కాలంలో సమకూరిన కంపెనీ రెవిన్యూ పంపకంలో
ఫకీర్ల నేతల మధ్యన వివాదం తలెత్తటంతో శోభన్ అలీకి కష్టకాలం ప్రారంభమైంది. ఈ
వివాదాల వలన బలహీనపడిన ఫకీర్లను మరింత బలహీనపర్చేందుకు కంపెనీ పాలకులు
కుట్రపూరిత చర్యలు తీసుకున్నారు. శోభన్ అలీ షాను పట్టిచ్చినవారికి నాలుగువేల రూపాయల
బహుమతిని ప్రకటించారు. దాడులను అధికం చేసారు. శత్రువు బారిన పడటం, శత్రువు
తుపాకి గుళ్ళకు గురికావటం, అంతర్గత సంఘర్షణల మూలంగా కాలగమనంలో పోరాటం
బాగా బలహీనపడింది. ఆ తరువాత సంవత్సరకాలంలోనే పోరాటాలకు తెరపడింది.
ప్రధాన ఫకీర్ నాయకులు, ప్రజల అభిమానం సంపాదించుకున్న నేతలు, సానుభూతిపరులు అంతరించాక కూడా మజ్నూ షా స్ఫూర్తితో పలువురు ఫకీర్ నేతలు