పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం ప్రజా పోరాటాలు.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పరిచయ వాక్యం

- కత్తి పద్మారావు

ప్రముఖకవి, రచయిత

పొన్నూరు, గుంటూరు జిల్లా.

ఇది చరిత్ర రచన కాదు...చరిత్ర నిర్మాణం

భారతదేశ చరిత్రలో ప్రధాన వాహికలు రెండు. ఒకరి మనువాద చరిత్ర, మరొకి జాతీయవాద చరిత్ర. మనువాదులు ఈ భూమిపై నివసించే ప్రజలను వర్ణ, మత దాక్పథాలతో చూసి రాస్తారు. జాతీయవాదులు ఈ భూమిపై పుట్టిన వారందార్ని సమతుల్యంగా భావించి రాస్తారు. మొదటిది అమానవవాద చరిత్ర అయితే, రెండవది మానవవాదా చరిత్ర. చరిత్ర రచన సత్యనిష్టతో కూడుకున్నది. సామాజిక సాంస్కృతిక ఆర్థిక, తాత్త్విక అంశాల పట్ల శాస్త్రీయ అవగాహన లేనిదే చరిత్ర రచన సాధ్యా కాదు. సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌గారు జాతీయవాద చరిత్రకారులు. ముస్లింలు ఈ నేల బిడ్డలని, జాతి వారసులని, ఈ సంస్కృతి పునాదులు వారి సాహస చర్యలతో నిర్మితమైనవని, ఈ నేల వారి శ్రమశక్తి ద్వారా ఈనిందని, ఈ దేశ కళలు వారి మహోన్నత ఔదార్యంతో వికసించాయని, ఈ రాజ్యవ్యవస్థ వారి కనుసన్నల్లో పరిప్లవించిందని, ఈ నేల పోరాటాలలోని రక్త స్రవంతులు వారి దేహం నుండి స్రవించినవని, సారగా ఈ మట్టి నుండిపుట్టిన వారు, ఈ మయట్టి కోసం త్యాగపూరితంగా జీవితాలను ధారపోసారని ఆయన సప్రమాణంగా, సాధికారికంగా ఓ యోధునిగా నిరూపిస్తూ వెళతారు. జీవితాన్ని, సామాజిక చరిత్రను సమన్యయించే క్రమంలో నశీర్‌ గారు నేటివిటీ ఆయువు పోస్తారు. భారతీయ ముస్లింలు వందకు వందపాళ్ళు ఈ దేశవాసులేనన్నది ఆయన సిద్ధాంతం. భారతదేశంలోని ప్రతి పోరాటం వారి రుధిర తర్పణలేక జరగలేదని ఆయన వాదం. భారతీయుడంటే ఎవరు ? దేశానికి, దేశ రక్షణకు, దేశ భవితవ్యానికి అసువులు అర్పించేందుకు ఎవరు వెనుకాడరో వారే అని చెప్పేటప్పుడు, 1770 ప్రాంతంలో బ్రిీటిష్‌ తుపాకి గుండ్లకు ఒకేసారి ప్రాణాలర్పించిన 150 మంది బెంగాల్‌ ముస్లిం ఫకీర్ల ఉదాంతాన్ని మన ముందుంచి, ఇప్పుడు చెప్పండి, ఎవరు నిజమైన దేశభక్తులో అని అడుగుతున్నారు. It os true.It is relevant . ఈ భారతదేశాన్ని ఆత్మీయం చేసుకున్న వారిలో ముస్లింలు మొదటి స్థానంలోకి వస్తారు. ఈ రెండవ ప్రశ్న నశీర్‌ ప్రతిభకు గీటురాయి. రచయిత గుండెల్లో దాగివున్న అగ్గి మంటకు ఇదొక ఉదాహరణ మాత్రమే. భారతదేశ చరిత్ర ఎంతో తవ్వాల్సింది, ఎంతో పూడ్చాల్సివుందన్న మాట నిజం. రచయిత ఈ పనిని సమర్థవంతంగా చేశారు కాబట్టే ఆయన ఆధునిక భారత చరిత్రకారుడిగా మన ముందుకు వచ్చారు. He is a