పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం ప్రజా పోరాటాలు.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

thoughtful person from all angles. ఈయన రచనలో హృదాయానికి హృదయానికి మధ్య ఒక బీట్ ఉంది. హృదయ సంఘర్షణను ఆయన ఆవాహన చేస్తారు. చరిత్ర చెబుతూ చెబుతూనే తాత్వికుడిగా మారతారు. మెదడుకు హృదయానికి అనుసంథానం కూర్చుతారు. చరిత్రలోని మూల భూతాంశాలన్నీతానే అనుభూతం చేసుకుని పాత్రద్వారా పలవరిస్తారు. చరిత్రలోని కాలమానాలను దాటి జీవన వ్యవస్థల్ని దృశ్యీకరింప చేసి మనిషికి మనిషికి, మనిషికి వ్యవస్థకి మధ్య దాగిన సున్నితాంశాలను ఆయన రికార్డు చేస్తారు.

ఈ రచయిత కొందారికి సంఘటనల సముఛ్ఛయకర్తగా కన్పిస్తారు. మరి కొందార్ని వెన్ను మీద పిడికిలితో గుద్ది మరీ నడిపిస్తారు. ఈయన రచనలోని ఆత్మ Self Respect. ఈయన చూసే చూపులో కొత్తదారి ఉంది. ఒక న్యూనతాభావాన్ని జయించేందుకు ఈయన కలం పట్టారు. ' జన్మభూమి ' ఈయన కార్యక్షేత్రం. ' మాతృభూమి ' ఈయన నినాదాం. ముస్లింలు జాతీయవాదులే కాదు, భరతభూమిని తరతరాలుగా అమ్ముకుంటున్న శక్తులపై పోరాడుతున్న సామాజిక శక్తులని నిరూపిస్తున్నారు. ఆయన కలానికి ఉన్న మరో పదును authenticity. ఏది చెప్పినా, ప్రమాణబద్ధంగా, చరిత్ర నికషోపలంగా చెబుతారు.

ఆయన రచనా శైలి పరిపక్వమైనది. తెలుగు నుడికారం లోని సొబగు, పలుగుబడిలోని విన్నాణం ఆయన రచనలకు ప్రవాహశీలతను, ప్రజ్వలన శక్తిని తెచ్చింది. The most irridict Writer. జ్ఞానపూర్వకమైన ఆయన కథనంలో స్వాతంత్ర్యసమరయోధులు శిల్పాకృతి దాల్చి మన గుండెల మీద నడుస్తారు. గుర్రాలు, ఏనుగులు, కత్తులు, కటార్లు, తుపాకులు, ఫిరంగులకు ఎదురు నిలబడి జాతీయతను ప్రకటిస్తారు. ఆయుధం పట్టుకున్న వాడు ఫకీరా ? సన్యాసియా ? అన్నది కాదు. ఆయన చూపు మాత్రం దేశం కోసం పోరాడుతున్నాడా ? లేదా ? అనే. Brilliant insight నశీర్‌లో కన్పిస్తుంది. గెరిల్లా పోరాటం జరిగినప్పుడు ఆయనే కందకాలు తీస్తూ, ఆయుధాలు కూర్చుతూ, సమాచారం అందిస్తూ శత్రు నిర్భేద్యమైన కోటల మీదా దాడి చేస్తున్నాడా ? అన్పిస్తుంది. Its not just writing. It's deep involvement. నశీర్‌ గారిని నేను పూర్తిగా చదవలేక పోయాను. ఈ భారత స్వాతంత్య్రోద్యామం : ముస్లిం ప్రజాపోరాలు ఎల్లడలా నన్ను ఒక యోధుడిగా మార్చివేసింది. నేను చాలాసార్లు ఊపిర్లు పీల్చాను. పిడికిళ్ళు బిగించాను. దాస్య విముక్తి పోరాట వీరుల్లో మనల్ని తాదాత్మం చేయగలిగిన ఒక గొప్ప రచనా క్రమం, శిల్ప నైపుణ్యం ఇందులో మనకు కన్పిస్తుంది. ఈ పుస్తకంలోని ఫకీర్‌ యోధుల మహాసేనాని మజ్నూ షా ఫకీర్‌ అయినా, ఫిరంగీయుల మీదా తిరగబడ్డ వహాబి పులి మీర్‌ నిస్సార్‌ అలీ అయినా, ఫరాజి ఉద్యామ నేత దూదు మియా కాని, శతాబ్దానికి పైగా వలసపాలకుల మీద పోరాడిన మలబారు మోప్లాల ప్రతినిధి మౌల్వీ అలీ ముస్సలియార్‌ గాని, అహింసాయుధంతో బ్రిటీషర్లను తరిమికొట్టిన పఠాన్‌ యోధుడు ఖాన్‌ అబ్దుల్‌ గఫార్‌ ఖాన్‌ కాని మనల్ని ఆవహిస్తారు. ఆ పోరాటాలలోని యోధులంతా, తరతరాలుగా మన మెదళ్ళకు పట్టిన తుప్పును వారి కత్తి పిడులతో వదలగొట్టి మనల్ని గుఱ్ఱపుస్వారి చేయిస్తారు. ఆత్మీయత కోసం, వ్యక్తిత్వం కోసం, జాతీయత కోసం, మాతృత్వం కోసం, మాతృభూమి కోసం మనల్ని యుద్ద సన్నద్ధులను చేస్తారు. ఆనాటి బ్రిటీష్ సామ్రాజ్యవాదుల మీదా పోరాడిన త్యాగాల నుండి పుట్టిన మనం ఈనాటి సాంప్రదాయ సామ్రాజ్యవాదాం మీద పోరాడేందుకు నైతికశక్తి నిస్తారు. We are not just soldiers, we are warriors and liberators also.

నశీర్‌ మన భుజాలపై రెండు చేతులు వేసి ఊపుతున్నట్టు అన్పిస్తుంది. మన