పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం ప్రజా పోరాటాలు.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హిందాువులూ, ముస్లింలూ, సిక్కులూ, పార్శీలూ, ఇతరులూ నిర్వహించిన పాత్రను అందారూ అధ్యయనం చేయాలి. అప్పుడే పరస్పర ఆవగాహన పెరుగుతుంది. సమైక్య గీతాలాపన అపస్వరం లేకుండ హృద్యంగా సాగుతుంది. ముఖ్యంగా ముస్లిం యోధుల దేశభక్తినీ, ధీరోదాత్తతనూ ముస్లింలు తెలుసుకుంటే ఆత్మన్యూనతాభావం, అభద్రాతాభావం పోయి ఆత్మవిశ్వాసం, భద్రాతాభావం పెరుగుతాయి. ఈ చరిత్రను హిందువులు అధ్యయనం చేస్తే బ్రిీటిష్‌ చరిత్రకారులు చేసిన మోసం ఏమో తెలిసిపోతుంది. మతోన్మాదుల ప్రబోధాలలోని వైమనస్యం వెల్లడవుతుంది. విశ్వాసరాహిత్యం తొలగిపోతుంది. లౌకికభావాలు బలపడినప్పుడే ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టం అవుతుంది. ఈ జాతి భవిష్యత్తు యావత్తూ ప్రజాస్వావ్యవస్థ మనుగడపైనే ఆధారపడి ఉంది. ఈ మేరకు అటువంటి నిర్మాణాత్మక కార్యక్రమానికి దోహదా చేసే రచన, మిత్రుడు సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ ' భారత సాfiతంత్య్రోద్యమం : ముస్లిం ప్రజాపోరాటాలు ' అను ఈ చారిత్రక గ్రంథాలో ముస్లిం జనసముదాయాలు ప్రధాన భాగస్వామ్యం వహించిన ఐదు పోరాటాల గురించి వివరించారు. 1760 ప్రాంతంలో ఆరంభమైన బెంగాల్‌ ఫకీర్ల తిరుగుబాటు నుంచిస్వాతంత్య్రం సిద్ధించేంత వరకూ దేశ విమోచనోద్యమంలో ముస్లింలు సాగించిన పలు ప్రజా పోరాటాలను కళ్ళకు కట్టినట్టు రచించిన రచయిత అభినందనీయుడు.బ్రిీటిషర్ల ఆధిపత్యాన్ని తొలిసారిగా వ్యతిరేకించిన ముస్లిం ఫకీర్ల గురించి, ఆ ఫకీర్లు హిందూసన్యాసులతో కలిసి ఐక్యంగా పరపాలకుల మీద తిరగబడిన తీరు గురించి, బ్రిీటిష్‌ పాలకులను ఎదిరించి పోరాడిన మహాబీ వీరుల గురించీ, పాలక వర్గాలకు వ్యతిరేకంగా దోపిడు శక్తుల మీదా కత్తిపట్టిన ఫరాజీ యోధాుల గురించీ, బ్రిీటిషర్ల దోపిడి, జమీందార్ల దాష్టీకాలను ఎదిరించి నిలవటమే కాక, జాతీయోద్యమంలో భాగస్వాములై త్యాగాలకు, ఆత్మార్పణలకు సిద్ధపడిన మలబారు మోప్లా వీరుల గురించి మనకు దొరకని అరుదైన సమాచారాన్ని నశీర్‌ గ్రంథరూపంలో అందించారు. ' సరిహద్దు గాంధీ' గా విఖ్యాతుడైన ఖాన్‌ అబ్దుల్‌ గఫార్‌ ఖాన్‌ నాయకత్వంలోని ఖుదా-యే-ఖిద్మాత్‌గార్‌ అహింసోద్యామాన్నీ, ఆ త్యాగమూర్తుల అపూర్వబలిదానాలను స్పూర్తిదాయకంగా వివరించారు. ఈ పుస్తకమే కాదు, భారత స్వాతంత్య్ర స మరంలో ముస్లింజనస ముదాయాలు నిర్వహించిన పాత్ర ను వివరిస్తూ , ఆయోధానుయోధుల జీవిత చరిత్రలను రేఖామాత్రంగా పేర్కొంటూ, ఆయన పలు వ్యాసాలు రాసారు. ప్రామాణిక చరిత్ర గ్రంథాలు ప్రచురించారు. నవభారత నిర్మాణంలో ముస్లింల పాత్రను విభిన్నదాష్టికోణాల నుంచి ప్రజలకు తెలిపే రచనలు చేశారు, చేస్తున్నారు. స్వయంగా సమర్థుడైన పత్రికా రచయిత, న్యాయవాది కనుక సులభగ్రాహ్యమైన శైలిలో సత్యనిష్టతో రచన చేయగలగటం నశీర్‌ అహమ్మద్‌ ప్రత్యేకత. ఈ కారణంగా ఆయన రచనలకు విశ్వసనీయత పెరిగింది. మిత్రుడు నశీర్‌ మరిన్నిపరిశోధానాత్మక రచనల ద్వారా సామాన్య జనబాహుళ్యానికి అందుబాటులో లేని అనేక విషయాలను వెలుగులోకి తీసుకురావాలని ఆకాంకిస్తున్నాను.