పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లింలు.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారత స్వాతంత్య్రోద్యమం-ముస్లింలు

1947 జూన్‌ 20వ తేదిన బెంగాలులో ఎన్నిక జరిగింది. ఆ ఎన్నికలకు గాను శాసన సభ్యులను రెండు విభాగాలుగా వర్గీకరించారు. సర్‌ ఉదయచంద్‌ మెహతాబ్‌ అధ్యక్షతన ముస్లిమే తర శాసనసబ్యులు అత్యధికంగా గల ప్రాంతంలోని శాసనసబ్యుల అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. ఈ విభాగంలోని 11 జిల్లాలకు చెందిన మొత్తం 79 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఈ సభ్యులలో 58 మంది విభజన కావాలని కోరగా 21 మంది వద్దన్నారు. ముస్లిం శాసన సభ్యులు అత్యధికంగా గల ప్రాంతాలలో మొత్తం 141 మంది శాసన సభ్యులు ఉన్నారు. ఈ శానస సభ్యులలో 35 మంది విభజనకు అంగీకరించగా, 106 మంది విభజన వ్యతిరేకించారు. భారత విభజనను మొత్తం మీద 162 మంది వ్యతిరేకించగా 114 మంది మసద్దతు పలికారు. భారత విభజన గురించి ప్రజలలో స్థిరీకరించబడిన సాధారణ అభిప్రాయానికి భిన్నంగా, అనాడు ముస్లిం శాసన సబ్యులు అధికంగాగల ప్రాంతాలలోని అత్యధిక శాసన సబ్యులు విభజనను వ్యతిరేకించటం గమనార్హం.

(In Bengal Muslim legislators opposed partition while Hindu legislators demanded partition of India. As per Mr. A Leonard Gordon, out of total 79 legislators from Hindu majority area 21 voted against the partition, 58 demanded partition. Likewise out of 141 legislators of Muslim majority area 106 voted against partition and 35 supported the demand for partition. It reveals that majority number of Muslim legislators opposed the partition of India. This was supported by VP Menon, the personal secretary to the then Home Minister Sri Sardar Patel, in his book TRANSFER OF POWER. -Dalith-Muslim Unity Why? And how?, by Dr. Ram Nath, DSA, Bangalore, 1995 and RADIANCE Views Weekly, 31 Aug. - 6 September 2003, Special Issue ).

చివరకు 1947లో పండిట్ జవహర్‌లాల్‌ అద్యక్షతన జరిగిన కాంగ్రెస్‌ సమావేశం విభజన ప్రతిపాదన చేయగా ఖాన్‌ అబ్దుల్‌ గపార్‌ ఖాన్‌ తప్ప భారత విభజనకు

అంతా అంగీకారం తెలిపారు.ఈ మేరకు భారత విభజనను వ్యతిరేకిస్తూ మౌలానా

ఆజాద్‌, సరిహద్దు గాంధీ చేసిన పలు ప్రయత్నాలు బూడిదలో పోసిన పన్నీరయ్యాయి. ఆ సమయంలో బాధతో కృంగి పోతూ, 'మమ్మల్నిమీరు తోడేళ్ళ పాల్జేశారు' అని మహాత్మా గాంధీతో మ్లాడుతూ ఖాన్‌ అబ్దుల్‌ గఫార్‌ ఖాన్‌ వాపోయారు. (తోడేళ్ల పాలు చేశారు, పార్యేలాల్‌, అనువాదం జి. కృష్ణ, గాంధీ సాహిత్య ప్రచురణా లయం, హైదారాబాదాు,1969 పేజి.148) ఈ పరిమాణాలకు జాతీయవాదులైన ముస్లింలంతా హతాశులయ్యారు.

65