పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లింలు.pdf/67

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

చేస్తుందన్న మాట గొప్ప మోసమన్నారు ఆర్థిక, రాజకీయ, సాంస్కతిక, బాషాపరమైన అడ్దుగోడలు లేకుండా ఆందర్ని ఏకం చేయాలని ఇస్లాం ప్రయత్నించింది. కాని చరిత్ర మరోరకం వాస్తవాలను వెల్లడిస్తుంది. ప్రథమ శతాబ్దం దాటగానే ముస్లిం దేశాలను ఇస్లాం ఆధారంగా ఎందుకని ఏకం చేయలేకపోయిందని ప్రత్యర్థులను ప్రశ్నించారు. (‘ It is one of the greatest frauds on the people to suggest that religious affinity can unite all area’s, which are geographically, economically, linguistically and culturally different. It is true that Islam sought to establish a society, which transcends racial, linguistic, and economic and political frontiers. History however proved that after the few decades or at most after the first century Islam not able to unite all the Muslim countries on the basis of Islam alone..’ -India Wins Freedom, Moulana Abul Kalam Azad, Orient Longman, Hyderabad,1995 Page. 248)

రెచ్చగొట్టబడిన ఉన్మాదం, అధికారం ద్వారా లభించే ప్రయోజనాల ఆకర్షణల మీదబలంగా పనిచేయడం, విభజన వాదులకు రుచించలేదు. విభజన డిమాండ్‌ ఊపందుకుంది. ఈ వాతావరణానికి బ్రిటిష్‌ పాలకవర్గాల కుటిలత్వం తోడుకోవటంతో ఎవరు ఎంతగా వారించినా ఫలితం లేకుండాపోయింది. ముస్లింలలో అత్యధికులు విభజనను వ్యతిరేకించారు. మౌలానా అజాద్‌ విభజన అలోచనను తీవ్రంగా ప్రతిఘటించారు. విభజన వలన రెండు దేశాలు ఏర్పడితే మత విద్వేషాలకు కారణం కాగలవని మౌలానా హెచ్చరించారు.

మనం త్వరపడి విభజనను అంగీకరిస్తే జిన్నా ద్విజాతి సిద్ధాంతాన్ని అంగీకరిం చినట్టు కాగలదని మౌలానా అన్నారు. (accept partition was to accept Jinnah’s two-nation theory.) విభజనను అంగీకరిస్తే ఇండియాకు శాశ్వత గాయాన్ని చేసినవారం కాగలమని ఆయన అవేదన వ్యక్తం చేశారు. (if we acted in haste and accepted partition, we should be doing permanent injury to India)

అత్యథికులు విభజనకు వ్యతిరేకం

ఈ సందర్భంగా విభజన మీద ప్రజాప్రతినిదుల అభిప్రాయాన్నితెలుసుకు నేందుకు బెంగాలులో ప్రయత్నం జరిగింది. ఆ ఎన్నికలో అత్యధిక హిందూ శాసన సబ్యులు గల ప్రాంతాల శాసనసబ్యులు విభజన డిమాండుకు మద్దతు పలుకగా, ముస్లిం శాసనసభ్యులు అత్యధికంగా గల ప్రాతంతాలలోని శాసనసభ్యులు విభజనను వ్యతిరేకిం చటం విశేషం. భారత విభజన మీద శాసన సబ్యుల అభిప్రాయాలను సేకరించేందుకు

64