పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లింలు.pdf/69

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌నశీర్‌అహమ్మద్‌

షోయాబుల్లా ఖాన్‌ బలిదానం

షోయాబుల్లా ఖాన్‌ బలిదానం ఈ సందర్భంగా భారతదేశంలో హైదారాబాదు సంస్థానం విలీనాన్ని పురస్కరించు కొని నిజాం నియంతృత్వానికి వ్యతిరేకంగా రజాకార్ల రంగును బహిర్గతపర్చుతూ జనం కోసం పోరాడిన పాత్రికేయులు షోయాబుల్లా ఖాన్‌ గురించి ప్రస్తావించాలి. హైదారాబాద్‌ నడి బొడ్డున రజాకార్లు 1948లో ఆయనను కాల్చి వేసి, కసితీరక, జనం కోసం కలాన్ని ఆయుధంగా చేపట్టి, నియంతృంపై అక్షరాగ్నులు కురిపించిన చేతిని దారుణంగా

నరికి వేశారు. రజాకారుల దాడిలో దారుణంగా గాయపడిన షోయబుల్లా ఖాన్‌ 'మరణం అనివార్యం. చావు నుండి ఎవ్వరూ తప్పిం చుకోలేరు. ఆ మరణం ఓ లక్ష్యం కోసం సంభవిస్తే గర్వించాలి. నేను దేశం కోసం మరణిస్తున్నందుకు మీరు సంతోషించాలి' అంటూ 1948 ఆగస్టు22వ తేదిన కన్నుమూశారు. ఈ విధంగా భారత స్వాతంత్య్రోద్యమంలో తమ పరిదులు, పరిమితుల మేరకు భాగస్వామ్యం వహిస్తూ పీడిత జన పక్ష∆పాతులుగా ప్రజలతో కలసి పనిచేసిన ప్రముఖులలో ముస్లిములు అనేకమంది ఉన్నారు.

ముస్లింల ప్రస్తావన లేని చరిత్ర అసంపూర్ణం

భారత విభజన వలన పలు ప్రయాజనాలను ఆశించిన సంపన్న కులీన వర్గాలు, విద్యాధికులు, అధికారం రుచి మరిగిన రాజకీయ వేత్తలు ఈ గడ్డను వదిలి వెళ్ళిపోయారు. ఈ మట్టిని వదలి పెట్టలేని, కొంగ్రొత్త ఆకర్షణలకు ఏమాత్రం చలించని సామాన్య ముస్లిం జనసముదాయాలు తమ భాగస్వామ్యం ఏమాత్రం లేని విభజనకు దూరంగా, లౌకిక భారతం మీద పరిపూర్ణ విస్వాసంతో, స్వంత గడ్డ మీదనే ఉండిపోయారు. మాతృ భూమి అభివృద్ధి కోరుకుంటూ, పుట్టి పెరిగిన గడ్డ పేరు ప్రతిష్టలను యినుమడింపచేసే పలు జీవన రంగాలలో విశిష్ట భాగస్వామాన్ని అందిస్తూ భారతీయ సమాజంలో అవిభాజ్య భాగమైపోయారు.

66