Jump to content

పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లింలు.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

నేతాజీకి నమ్మకమైన సహచరులు ఈ విధంగా ఎప్పటికప్పుడు జాతీయోద్యమంలోని అన్ని ప్రధాన ఘట్టాలలో ముస్లిమేతర జనసముదాయాలతో పాటుగా తమదైన భాగస్వామ్యాన్ని నిర్వర్తించిన ముస్లిం సమాజం, నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ వెంట కూడా అదే స్థాయిలో తన పాత్రను నిర్వహించింది. నేతాజీ నాయకత్వంలోని ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌లో అనేకమంది

ముస్లింలు ప్రధాన బాధ్యతలను నిర్వర్తించారు. మాతృభూమి సేవలో కర్తవ్యనిర్వహణ కొనసాగిస్తూ అమరులయ్యారు. ఆజాద్‌ హింద్‌ఫౌజ్‌లో జనరల్‌గా షానవాజ్‌ ఖాన్‌, కల్నల్‌గా అజీజ్‌ అహమ్మద్‌, యం.కె. ఖైనీలు ప్రధాన బాధ్యతలు నిర్వహించారు. హైదారాబాద్‌ జనరల్‌ షానవాజ్‌ ఖాన్‌ వాసులైన ముహమ్మద్‌ ఆయూబ్‌, ఖమరుల్‌ ఇస్లాం, తాజుద్దీన్‌ గౌస్‌ వంటి యువకిశోరాలు నేతాజీ వెంట నడిచారు. ఈ పోరాటం విఫలం తరువాత బ్రిటిష్‌ ప్రభుత్వం ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ ప్రముఖులైన జనరల్‌ షానవాజ్‌ఖాన్‌, కెప్టెన్‌ వి.కె. సెహగల్‌, లెఫ్టినెంట్ జి.యస్‌. థిల్లాస్‌ల మీద రాజద్రోహం నేరం మోపి విచారణకు ఆదేశించింది. ఈ యోధుల పక్షాన వాదించేందుకుగాను ఆబుల్‌ కలాం ఆజాద్‌ తగిన ఏర్పాట్లు చేయించారు. ఆ సందర్భంగా ముహమ్మద్‌ అలీ జిన్నా జనరల్‌ షానవాజ్‌ ఖాన్‌కు ఒక సందేశం పంపారు. రాజద్రోహం నేరం క్రింద విచారణకు గురైన మిగిలిన సహచరుల నుండి వేరుపడితే జనరల్‌ పక్షాన తాను కేసు వాదించడానికి సిద్దమని

జిన్నాతెలిపారు. అందుకు జనరల్‌ షానవాజ్‌ అంగీకరించలేదు. జిన్నాకు సమాధానంగా 'స్వాతంత్య్ర సమరంలో మేం భుజం భుజం కలిపి పోరాడాం.


అబిద్‌ హుస్సేన్‌ సఫ్రాని మా నాయకత్వం స్పూర్తితో మా కామ్రేడ్స్‌

58