పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లింలు.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారత స్వాతంత్య్రోద్యమం-ముస్లింలు

యుద్ధభూమిలో వీరోచితంగా పోరాడుతూ ప్రాణాలు వదిలారు. నిలబడినా, నేలకూలినా కలిసే ఉంటాం, అని జనరల్‌ షా నవాజ్‌ స్పష్టం చేశారు. ( ‘ ..We have stood shoulder to

shoulder in the struggle for freedom. My comrades have died on the field of battle inspired by our leadership we stood or fall together..’) నకీ అహ్మద్‌ చౌదరి ఈ విచారణ సందర్బంగా ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ యోధులకు శిక్షలు పడితే సహించేదిలేదని ప్రజలు ప్రకటించారు. అప్పటికీ రషీద్‌ అలీ అను వీరజవానుకు ఏడు ఏండ్ల జైలుశిక్ష విధించగా ప్రజలు ఆగ్రహవేశాలు వ్యక్తం చేశారు. నేతాజీ సన్నిహిత సహచరులైన అక్బర్‌షా, 1941లో బ్రిటిష్‌ ప్రబుత్వం కళ్ళుగప్పి నేతాజీ ఇండియా నుండి తప్పించుకొని వెడుతున్నప్పుడు ఆయన వెంట ఉన్నారు. నేతాజీ బెర్లిన్‌ నుండి చాకచక్యంగా తప్పించుకున్న సాహసఘట్టంలో ఆయనతోపాటు 90 రోజులపాటు సబ్‌మెరైన్‌లో గడిపిన వ్యక్తిగా ఆయన కార్యదర్శి అబిద్‌ హుస్సేన్‌ సఫ్రాని అపూర్వ గౌరవాన్నిపొందారు. నేతాజీ టోక్యో నుండి ప్రయాణమైన విమానంలో ఆయన వెంట ఉండి వీరమరణం పొందిన వ్యక్తులలో కల్నల్‌ హబీబుర్‌ రహమన్‌ ఒకరు.

ఆ నాడు '..మీ రక్తం నాకివ్వండి.. మీకు నేను స్వాతంత్య్రాన్నిస్తాను..' అంటూ, నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ ఇచ్చిన నినాదాన్ని గౌరవిస్తు మాతృ దేశ విముక్తికోసం సాగిన సాయధ పోరాటంలో నేలకొరిగిన యోధులలో కొందరి గురించి FREEDOM MOVEMENT AND INDIAN MUSLIMS లో గ్రంధ రచయిత SANTIMOY RAY క్లుప్తంగా పేర్కొన్నారు. ఆ నమోడూ ప్రకారం పోరాటంలో అమరు లైన వారిలో ప్రస్తుత పాకిస్థాన్‌ లోని పంజాబ్‌కు చెందిన అబ్దుల్‌ అజీజ్‌ అబ్దుల్‌ రహమాన్‌ ఖాన్‌, ఖమురుల్‌ ఇస్లాం అహ్మద్‌ ఖాన్‌, అఖ్తర్‌ ఆలీ, అల్లావుద్దీన్‌ (హర్యానా -

59