పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లింలు.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారత స్వాతంత్య్రోద్యామం-ముస్లింలు

సాగిన కాల్పులలో అనేకమంది అమరులయ్యారు. అంతటి ప్రభావాన్ని కలుగజేసిన నినాదాన్ని సృష్టించింది యూసుఫ్‌ మెహర్‌ అలీ.

1942 ఆగస్టు 9వ తేదీ నాటి సమావేశంలో యూసుఫ్‌ మెహర్‌ అలీ తాను ఓ చిన్న కాగితం మీద క్విట్ ఇండియా అను నినాదం రాసి ఆ కాగితాన్నిగాంధీజీకి అందించారు. గాంధీజీ 1940లో ఆగష్టులో క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రకటిచారు. చారిత్రక ప్రాధాన్యత గల ఈ క్విట్ ఇండియా నినాదాన్ని బోంబాయికి చెందిన ఉద్యమకారుడు యూసుఫ్‌ మోహరాలి సృష్టించిందని బహు గ్రంథ రచయిత Dr.AU Sahik IPS కదనం. ఈ మేరకు

క్విట్ ఇండియా శీర్షికతో యూసుఫ్‌ మెహర్‌ అలీ ఓ గ్రంథాన్ని కూడా ప్రచురించారు. ఆ పుస్తకం పలు పునర్మద్రణలకు నోచుకుంది. ఈ ఉద్యమంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఫతే ఉల్లాఖాన్‌, ముహమ్మద్‌ హనీఫ్‌, ముహమ్మద్‌ డాక్టర్‌ సయ్యద్‌ మహమ్మద్‌ హుస్సేన్‌లు ప్రముఖపాత్ర వహించారు. క్విట్ ఇండియా ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడేసరికి పోలీసులు విచక్షణారహితంగా విరుచుకపడ్డారు. బ్రిటిషు పోలీసుల ఆకృత్యాలకు అంతులేకుండా పోయింది. అయినప్పటికి ప్రజలు పోరుబాట వీడలేదు. జాతీయ కాంగ్రెస్‌ నాయకులు మౌలానా ఆజాద్‌, డాక్టర్‌ సయ్యద్‌ మహమ్మద్‌, డా|| అసఫ్‌ అలీ, తదితర ప్రముఖులను అరెస్టు చేసి అహమ్మద్‌ నగర్‌ కోటలో బంధించారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనవద్దని ముస్లిం లీగ్ నేతలు కోరినా, ఆ అభ్యర్థనలను ఖాతరు చేయకుండా ముస్లింలు పెద్ద సంఖ్యలో ఉద్యమించారు.

మౌలానా అజాద్‌ నిర్బంధం నుండి విడుదలయ్యాక, 1945లో జరిగిన సిమ్లా సమావేశానికి జాతీయ కాంగ్రెస్‌ ప్రతినిధిగా హజరయ్యారు. ఈ సందర్భంగా దేశంలోని ముస్లింలకు ముస్లిం లీగ్ మాత్రమే ప్రతినిధిగా పేర్కోంటూ ముస్లిం లీగ్ నాయకులు ముందుకు రావటంలో చర్చలు సఫలం కాలేదు. మౌలానా ఆజాద్‌ అధ్యక్షనిగా పని చేసిన కాలంలో ఆయన వ్యకిగత సత్య గ్రహ ఉద్యమం, క్రిప్సుతో చర్చలు, క్విట్ ఇండియా ఉద్యమాలకు సమర్థవంతమైన నాయకత్వం అందించారు.

57