పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లింలు.pdf/56

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

భారత స్వాతంత్య్రోద్యమం-ముస్లింలు

బాద్షాఖాన్‌ స్వయంగా వివరించారు. ఆ కథనం చదువుతుంటే గుండె చెరువైపోతుంది.

ఆ తరు వాత కూడా లాహోర్‌లోని కిస్సాఖాని బజారులో నిరాయుదులైన రెడ్‌షర్ట్స్ మీద బ్రిటిషు

భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లింలు.pdf

పోలీసులు కిరాతకంగా జరిపిన కాల్పులు వందలాది ప్రజలను బలి తీసుకున్నాయి. ఈ కాల్పులు మూలంగా, ప్రబుత్వం పోలీసులు, సైనికుల దాష్టికాల వలన యోధులు నేలకు వొరుగు తున్నా, ఏ మాత్రం సరిహద్దు గాంధీ భయపడని ఖుదా-యే-ఖిద్మాత్‌గార్‌ వీరులు బ్రిటిషు బలగాల తుపాకులకు ఎదురు నిలిచారు. ప్రాణాలు కొల్పోయారు. ఏ మేరకు ప్రాణ నష్టం జరిగినా,బ్రిటిష్‌ పోలీసుల కిరాతకం ఎంతగా సాగినా, అహింసా మార్గాన్ని మాత్రం వీడలేదు. ఆ కారణంగా ప్రపంచ అహింసోద్యమ చరిత్రలో ఖుదా-యే-ఖిద్మాత్‌గార్‌ యోధుల చరిత్ర ప్రత్యేక అధ్యాయమయ్యింది.

ఈ శాసనోల్లంఘన ఉద్యమంలో మౌలానా అల్తాఫ్‌ హుస్సేన్‌, అబ్దుల్‌ హయాత్‌, తయ్యబ్‌ అలీ, గయాజుద్దీన్‌ పఠాన్‌, జలాలుద్దీన్‌ హాష్మి, ప్రొఫెసర్‌ హుమాయూన్‌ కబీర్‌, అబూహసన్‌ సర్కార్‌, రియాజుల్‌ కరీం, ఫక్రుద్దీన్‌ అలీ అహమ్మద్‌ తదితరు లు పాల్గొన్నారు. ఈ నేతలంతా సుదీర్గ… జైలు శిక్షలనుభవించారు.

1936లో లక్నోలో జరిగిన కాంగ్రెస్‌ సమావేశం తరువాత సామ్యవాద భావాలుగల నాయకులైన రఫీక్‌ జకారియా, కల్నల్‌ జైదీ, డాక్టర్‌ యూసుఫ్‌ మెహర్‌ అలీ, హుస్సేన్‌ జహీర్‌, కె.ఎ. అబ్బాస్‌, రఫీ అహమ్మద్‌లు జాతీయ కాంగ్రెస్‌లో చేరారు. మన రాష్ట్రం నుండి అబిద్‌ హుస్సేన్‌ సప్రాని, బద్రుల్‌ హసన్‌, సిరాజుల్‌ హసన్‌ తిర్మిజ్‌, బాకర్‌ అలీ మిర్జా, అహమ్మద్‌ అలీఖాన్‌ తదితరులు జాతీయ కాంగ్రెస్‌ సభ్యులయ్యారు.

ఈలోగా 1939 ద్వెతీయ ప్రపంచ సంగ్రామం ప్రారంభమైంది. ఈ యుద్ధాన్ని పురస్క రించుకుని కాంగ్రెస్‌ మంత్రులంతా రాజీనామాలు చేశారు. ఖిలాఫత్‌ ఉద్యమంలో ఎంతో గర్వంగా పాల్గొన్న ముస్లింల విశ్వాసాలకు బలమైన గాయం అయ్యేలా టర్కీ అధినేత ముస్తఫా కమాల్‌ పాషా ఖిలాఫత్‌ను శాశ్వతంగా రద్దుచేసి తన రాజ్యాన్ని లౌకిక రాజ్యంగా ప్రకటించాడు.

53