పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లింలు.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

జిన్నా పునóప్రవేశం - మారిన సమీకరణలు

ముహమ్మదాలి జిన్నా 1924-1929 ప్రాంతంలో 14 సూత్రాల పథకం తయారు చేశారు. భవిష్యత్తు రాజ్యాంగ నిర్మాణంలో ఈ సూత్రాలను పరిగణనలోకి తీసుకోవాలన్నది జిన్నా ఉద్దేశ్యం.ఈ పథకం పూర్తి స్థాయి చర్చకు నోచుకునే లోపుగా లీగ్ అధ్యక్ష స్థానాన్ని వదలి ఆయన లండన్‌ వెళ్ళిపోయారు. 1930లో లండన్‌ వెళ్ళిపోయిన మహ్మద్‌ అలీ జిన్నా 1934లో ఇండియాకు తిరిగి వచ్చారు. ఆయన పున: ప్రవేశంతో

జాతీయోద్యమంలో నూతన సమీకరణాలకు స్థానం కలిగింది. రాజకీయాలలో పలు సామాజిక వర్గాల మధ్య దూరం ఏర్పడింది. ఈదూరం ముహమ్మదాలీ జిన్నా పున:ప్రవేశంతో మరికాస్త ఎక్కువైంది. ఆయన తిరిగి ఇండియా రాగానే ముస్లింలీగ్ అధికార పగ్గాలను చేబట్టారు . బలపడతున్న జాతీయ కాంగ్రెస్‌ను బలహీనం చేసి లక్ష్యదిశగా సాగుతున్న స్వతంత్య్ర పోరాటాన్ని నిర్వీర్యం చేసేందుకు జిన్నాను బ్రిటిష్‌ ప్రబుత్వం పావులాగా వినియోగించదలచింది. ఆ సమయంలో ద్వితీయ రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి గాంధిజీ డాకర్‌ అన్సారిని తీసుకళ్ళక పోవటంతో జిన్నాకు మంచి ఆయుధ లభించింది. భారతదేశంలోని ముస్లింలకు ప్రాతినిధ్యం వహించే ఏకైక సంస్థగా ముస్లింలీగ్ ను తీర్చి దిద్ది, జవజీవాలు అందిచేందుకు ఆయన నడుం కట్టాటారు. ఒకప్పుడు జాతీయవాదిగా వ్యవహరించిన జిన్నా ఆలోచనలు ఆ తరువాత మారిపోయాయి.

1935 తరువాత జరిగిన ఎన్నికలలో బీహార్‌, బోంబాయి రాష్ట్రాలకు సంబంధించి పండిట్ జవహర్‌ లాల్‌ నెహ్రూ˙ లాంటికాంగ్రెస్‌ నాయకులు తీసుకున్న పలు అహేతుక నిర్ణయాలు ముస్లిం లీగ్ మరింత బలపడఋటానికి దోహదపడ్డాయి. ఈ విషయాన్ని మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ తన ప్రఖ్యాత ఇండియా విన్స్‌ ప్రీడం గ్రంథంలో చాలా వివరంగా చర్చిస్తూ,ఉత్తర ప్రదశ్‌ లో మంత్రివర్గం ఏర్పాటు విషయ ంలో జవహర్‌లాల్‌ తీసుకున్న నిర్ణయాన్ని స్పష్టంగా తప్పుపట్టారు.

( ‘ Jawaharlal’s action gave the Muslim league in the UP, a new lease of Life. All Students of Indian politics know that it was from the UP

54