పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లింలు.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

స్వాతంత్య్ర సాధనకు జాతీయ కాంగ్రెస్‌ ప్రధాన ఆయుధమైంది. కమ్యూనిస్టు, సోషలిస్టు, విప్లవ భావాలు గల వారంతా జాతీయ కాంగ్రెస్‌లో అంతర్భాగమయ్యారు. గాంధీజీ తన వినూత్నఉద్యమాల ద్వారా అశేష ప్రజానీకాన్ని కదిలించగలిగారు. కదిలించి ఉద్యమ దిశగా నడిపించగల నాయకులయ్యారు.

అహింసా మార్గాన రెడ్‌షర్ట్స్ ఆత్మార్పణలు

1930లో శాసనోల్లంఘనకు గాంధీజీ పిలుపు ఇవ్వగానే ఖిలాఫత్‌ ఉద్యమం నాటి ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ ముస్లింలు శాసనోల్లంఘనలో పాల్గొన్నారు. ఈ ఉద్యమం పట్ల జమైతుల్‌ ఉలేమా, ఆరహార్‌ పార్టీ, జాతీయ ముస్లిం కాన్పెరెన్స్‌, ఖుదా-యే-ఖిద్మాత్‌గార్‌ లాంటి సంస్థలు ఎంతో ఆసక్తి చూపాయి.

ఈ సందర్భంగా సరిహద్దుగాంధీగా విఖ్యాతులైన పఠాన్‌ నాయకులు ఖాన్‌ అబ్దుల్‌ గఫార్‌ ఖాన్‌ తన సోదరునితో కలసి ఖుదా-యే-ఖిద్మాత్‌గార్‌ అహింసా యోదుల దళాన్ని ( రెడ్‌ షర్ట్స్) నిర్మించారు. ఈ దళ సభ్యులు బ్రిటిష్‌ పోలీసుల తీవ్ర నిర్బంధాల మధ్య ఎంతో ప్రశాంత చితంతో అహింసామార్గం వీడక ప్రాణాలర్పించానికి సిద్దపడ్డారు . ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఈ అహింసోద్యమంలో భాగంగా 1930 మే మాసంలో ఖాన్‌ అబ్దుల్‌ గఫార్‌ ఖాన్‌ స్వంత గ్రామంలో బ్రిటిష్‌ పోలీసుల పైశాచిక కాల్పులకు వందలాది రెడ్‌ షర్ట్స్ దళ సబ్యులు బలైపోయారు. ఆనాటి సంఘ టనలను

52