పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లింలు.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారత స్వాతంత్య్రోద్యామం-ముస్లింలు

సాగిన ఈ పోరాటానికి సూర్యసేన్‌ నాయకులు. పశ్చిమ బెంగాల్‌లోని చిట్టగాంగ్ కేంద్రంగా, బ్రిటిష్‌ పాలకుల మీద విరుచుకుపడిన ఈ యోదులలో సత్తార్‌, మీర్‌ అహమ్మద్‌, ఫకీర్‌ అహమ్మద్‌ మియా తదితరులు ప్రముఖులు. బ్రిటిష్‌ పోలీసుల డేగ కళ్ళ నుండి తప్పించుకుంటూ, పథకం ప్రకారంగా అదను చూసి బ్రిటిష్‌ పోలీసులను, సైనికులను దెబ్బతీస్తూ చిట్టగాంగ్ వీరులు తమ పోరు సాగించారు.

బ్రిటిషు ప్రబుత్వం పటిష్టమైన ఇంటెలిజెన్సీ వ్యవస్థ కలిగియున్నప్పటికీ చిట్టగాంగ్ వీరుల చర్యలను పసిగట్టి నివారించలేకపోయింది. బ్రిటిష్‌ ప్రభుత్వ వైఫల్యానికి ప్రధాన కారణం, ఆ ప్రాంతపు ముస్లిం రైతాంగ, పేద వర్గాల ప్రజానీకం విప్లవకారులను కడుపులో పెట్టుకు ని కాపాడటమే! విప్లవకారులకు ఆశ్రయం కల్పించటమేకాక, ఆహారం అందిసూ, బ్రిటిష్‌ పోలీసుల కదలికలను రైతు కుటుంబాల బాలబాలికలు విప్లవకారులకు తక్షణమే చేరవేసేవారు. అంతే కాకుండా ముస్లిం యువకులు విప్లవకారులకు రక్షణగా సంచరిస్తూ గమ్యస్థానాలకు చేర్చేవారు.

1933 ఫిబ్రవరిలో చిట్టగాంగ్ విప్లవకారుల నేత సూర్యసేన్‌ అరెస్టయ్యేంత వరకు సాగిన ఈ పోరు చరిత్రలో తనదైన స్థానాన్నిస్వంతం చేసుకుంది. సూర్యసేన్‌ను అరెస్టు చేసిన బ్రిటిష్‌ పాలకులు ఆయనను 1934 జనవరిలో ఉరితీశారు. ఆయనను అరెస్టు చేశాక దిగాలు పడిపోయిన ముస్లిం రైతు కుటుంబాలు, ఆయనను ఉరితీశాక వారాల తరబడి అన్నపానాలు మాని విలపించాయి.

ఈ విప్లవ నేతలంతా బ్రిటిష్‌ ప్రభుత్వ క్రూరత్వానికి బలైపోయారు. నేతలు స్వీపాంతరవాస శిక్షలు, కాల్చివేతలు, ఉరిశిక్షలకు గురికావటంతో అగ్ని యుగం ముగిసింది. ఇంకా మిగిలియున్న నాయకులు కార్యకర్తలలో పలువురు భారత జాతీయ కాంగ్రెస్‌ మార్గాన్ని స్వీకరించటంతో ఆత్మబలిదానాలతో ఎరుపెక్కిన విప్లవ యుగం ముగిసింది.

సామ్యవాదంతో ప్రభావితమై త్యాగాలకు ముందడుగు

బ్రిటిష్‌ ప్రభుత్వాన్ని సాయుధ పోరాటం ద్వారా మాత్రమే భారతదేశం నుండి వెళ్ళగొట్టగలమని భావించిన విప్లవకారులంతా ఆ తరువాతి కాలంలో కమ్యూనిజం పట్ల ఆకర్షితులయ్యారు. కమ్యూనిస్టు సిద్ధాంతాలతో ప్రేరణ పొందిన ఈ యువకులు, కార్మిక రైతాంగ ఉద్యమాలలో చురుగ్గా పాల్గొన్నారు.

49