పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లింలు.pdf/51

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

రాజకీయంగా ముందుకు సాగటం, ఆ తరువాత జరిగిన ఎన్నికలలో పాల్గొనటం తదితర సంఘటనలు జరిగాయి. అనంతర కాలంలో ఐక్యతను ఆశిస్తున్న మౌలానా అబుల్‌ కలాం అజాద్‌ అధ్యక్షతన 1923లో ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్‌ ప్రత్యేక సమావేశంలో ఈ సమస్య పరిష్కారం కావటంతో భారత జాతీయ కాంగ్రెస్‌ ప్రమాదం నుండి బయటపడంది.

సైమన్‌ గోబ్యాక్‌ ఉద్యమం

1927 మద్రాసు సమావేశంలో సైమన్‌ కమిటీ బహిష్కరణ నిర్ణయం జరిగింది. ఆ సందర్భంగా సైమన్‌ గోబ్యాక్‌ అంటూ బొంబాయి ప్రజలు నినదించారు. ఈ సందర్భంగా జరిగిన భారీ ప్రదర్శనకు యువ నాయకుడు యూసుఫ్‌ మోహరాలి నాయకత్వం వహించారు.

భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లింలు.pdf

భారత దేశం మొత్తాన్ని కదిలించిన ఆ ప్రదర్శ నలో , 'The British Rulers are like dogs. If you kick them, they will lick you. But if you lick them, they will kick you.(Yusuf Meharally by Madhu Dendavate, NBT, India, 1986. Page103 ) అని పరాయి పాలకుల కుటిల నైజాన్ని ప్రకటిస్తూ, ఉద్యమించినట్టయితే, ఆంగ్లేయ ప్రభుత్వం తోకముడిచి పారిపోగలదని, అందువలన ఉద్యమించాల్సిందిగా ఆయన ప్రజలకు, ప్రధానంగా యువతకు పిలుపునిచ్చారు. యూసుఫ్‌ మోహరాలి బ్రిటిషు ప్రబుత్వం విధివిధానాలను ఎద్దేవా చేస్తూ ప్రకటనలు ఇవ్వటమే కాకుండాప్రత్యేకంగా తాను తయారు చేయించిన పోస్టర్లను యూసుఫ్‌ మెహర్‌ అలీ బోంబాయిలో ప్రదర్శించి సంచలనం సృష్టించారు. ఈ చర్యలతో ప్రభుత్వం మండిపడగా, యువకులు మాత్రం ఆయనను ఆదర్శంగా తీసుకున్నారు.

చిట్టగాంగ్ వీరులకు చేయూత

విప్లవయోదులు చేస్తున్న వ్యక్తిగత బలిదానాలకు భిన్నంగా ఒక పద్ధతి ప్రకారంగా బ్రిటిష్‌ పాలకుల వ్యవస్థ మీద పలుదాడులు జరుపుతూ 3 సంవత్సరాలపాటు విప్లవించిన వీరులుగా చిట్టగాంగ్ విప్లవకారులు ఖ్యాతిగాంచారు. 1929 నుండి 1933 వరకు

48