పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లింలు.pdf/53

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

రష్యా ప్రజలు నిరంకుశ జార్‌ చక్రవర్తి మీద

సాధిం చిన అద్బుత విజయంతో సామ్యవాద సిద్దాంతా పట్ల ఆకర్షిరులైన యవకు లు కార్మిక-కర్షక జనావళిని చైతన్యవంతులను గావించి అన్నివర్గా ల ప్ర జ లను జాతీయోద్యమంలో భాగస్వాములు చేయాలన్న సంకల్పంతో ముందుకు కదిలారు. అమీర్‌ హైదార్‌ ఖాన్‌

ఈ నేపథ్యంలో దక్షిణ భారతదేశానికి కమ్యూనిజాన్ని పరిచయంచేసి, పెషావర్‌లో జన్మించిన అమీర్‌ హెదార్‌ ఖాన్‌ ఆంధ్రా ప్రదశ్‌ చెందిన ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు శ్రీ కంభంపాటి సీనియర్‌, శ్రీ సుందరయ్యలను స్వయంగా ఆనాడు పార్టీ ప్రవేశం చేయించారు. ఖిలాఫత్‌ ఉద్యమంసందర్భంగా, స్వదేశం పరాయిపాలకుల బానిసత్వంక్రింద ఉన్నందున ఆఫ్గనిస్తాన్‌కు భారీ సంఖ్యలో వలస వెళ్ళడానికి విఫల ప్రయత్నంచేసిన కొందరు అటునుండి రష్యా వెళ్ళారు. అక్కడ సామ్యవాదభావాల పట్ల ఆకర్షితులై, ఆయా సిధ్దాంతాలను అధ్యయనంగావించిన పలువురు, ఆ భావాలను ప్రచారం చేసూ, కార్మికులను బ్రిటిష్‌ సామ్రాజ్యవిస్తరణ కాంక్షకు వ్యతిరేకంగా ఉద్యమింపచేయ ప్రయ త్నించారు. అటువంటి ప్రముఖులలో షౌకత్‌ ఉస్మాని, డాక్టర్‌ జైనుల్లాబిద్దీన్‌, ఆయన భార్య హజరా బేగం, కాకా బాబుగా ఖ్యాతిగాంచిన ముజఫర్‌ అహమ్మద్‌, డాక్టర్‌ మహ్మద్‌ జాఫర్‌, షంషుల్‌ హుదా, డాక్టర్‌ అష్రాఫ్‌ ఉన్నారు. ఈ సిద్ధాంతాలను బాగా వంటపట్టించుకున్న ప్రముఖ

కవులు సర్దార్‌ అలీ జాఫరి, సజ్జాద్‌ జహిర్‌, ఖ్వాజి

నజ్రుల్‌ ఇస్లాం, మౌలానా హసరత్‌ మోహాని, హైదారాబాదుకు చెందిన మక్దూం మొహిద్దీన్‌, లాంటి వారెందరో కష్టనష్టాలను భరిస్తూ ప్రజలను ఆ దిశగా నడిపారు. ఈ సందర్భంగా అమీర్‌ హైదర్‌ ఖాన్‌, ముజఫర్‌ అహమ్మద్‌, ష్ధకత్‌ ఉస్మానిలాంటి నాయకుల మీదచరిత్ర ప్రసిద్ధి చెందిన పెషావర్‌, మీర్‌ కుట్రకేసులనుబ్రిటిష్‌ ప్రభుత్వం బనాయించి సంవత్సరాల తరబడి ఆ నేతలను జైళ్ళల్లో కుక్కింది.

                                     షౌకత్‌ ఉస్మానీ

50