పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లింలు.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

నిరాకరణ ఉద్యమంలో మౌల్వీ అలీ ముస్సలియార్‌ నేతృ త్వంలో ప్రత్యేక పాత్ర పోషించారు. శాంతియుతంగా గాంధేయ మార్గంలో పయనిస్తూన్న మోప్లాలను రెచ్చగొట్టటంతో తిరగబడిన మోప్లాల దాటికి తట్టుకోలేక బ్రిటిష్‌ అధికారులతో సహా పోలీసు బలగాలు పలాయనం చిత్తగించాయి.

ఆ అనుకూల వాతావరణంలో మోప్లాలు తమదైన రీతిలో ప్రజాపాలనను ఏర్పాటుచేసుకుని కొత్త చరిత్ర సృష్టించారు. అయితే మోప్లాల చేతిలో పరాభవాన్ని ఎదుర్కొన్నందున, కసిపెంచుకున్న బ్రిటిషు సైనిక, పోలీసు బలగాలు ఆ తరువాత గ్రామాల మీద విరుచుకపడి సాగించిన మారణకాండకు వందలాది మోప్లాలు బలయ్యారు.

ఈ సందర్భంగానే బళ్ళారి రైలు విషాదాంతంగా పేర్కొనబడిన ట్రైనుట్రాజడీ జరిగింది. అతి చిన్న రైలు వ్యాగన్‌లో 127 మంది మోప్లాలను బలవంతంగా కుక్కి, వ్యాగన్‌లోకి గాలి కూడాచొరబడకుండా సీలు చేసి, తిరూరు జైలు నుండి సుదూరాన ఉన్న బళ్ళారి జైలుకు పంపుతుండగా, కోయంబత్తూరుకు వచ్చేసరికి 70 మందికి పైగా మోప్లాలు ఊపిరాడక రైలు వ్యాగన్‌లో మరణించారు. ఈ పోరాటంలో 252 మందిని సైనికులు కాల్చివేయగా, 500 మందికి యావజ్జీవిత కారాగార శిక్ష విధించారు. మౌల్వీ కున్‌యి ఖాదర్‌, మౌల్వీ అలీ ముస్సలియార్‌ లతో పాటు పలువురికి ఉరిశిక్షలు కూడా పడ్డాయి. ఈ ఉద్యమంలో మహమ్మద్‌ అబ్దుల్‌ ర్రహ్మన్‌ సాహెబ్‌, మౌల్వీ ఖాదర్‌ మొహిద్దీన్, మొహిద్దీన్‌ కోయా తదితరులు ప్రముఖ పాత్రవహించారు.

అగ్నియుగం ద్వీతీయ ఘట్టం

ఖిలాఫత్‌, సహాయనిరాకరణ, శాసనోల్లంఘన ఉద్యమాల తీవ్రతను చూసిన, భారతీయుల ఐక్యతను గమనించిన బ్రిటిష్‌ ప్రభుత్వం రెచ్చి పోయింది. ప్రజలను తీవ్ర నిర్బంధాలకు గురిచేసింది. పోలీసులను ఉసిగొల్పి దామనకాండకు పాల్పడింది. ఆగ్రహావేశపరు లైన ప్రజలు ఉత్తర ప్రదశ్‌లోని చౌరీచౌరాలో పోలీసుస్టెషన్ ను తగులబెట్టారు . ఈ సంఘటనలో పలువురు పోలీసులు మృతి చెందటంతో గాంధీజీ శాసనోల్లంఘన ఉద్యామాన్ని అకస్మాత్తుగా విరమింపజేశారు. మహాత్ముడు ఉద్యమాన్నిఆకస్మికంగా విరమించటంతో ఉద్యమిస్తున్న నేతలు, ప్రజలు ప్రదానంగా విప్లవ భావాలు గల యువత నిరసన వ్యక్తం చేశారు. ఆ నిరసన నుండి విప్లవోద్యమం ద్వీతీయ ఘట్టం రూపుదిద్దుకుంది.

44