పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లింలు.pdf/46

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

భారత స్వాతంత్య్రోద్యమం-ముస్లింలు

MOALLA ద్వారా ప్రజలలో చర్చకు పెడుతున్నారు. సంపూర్ణ స్వరాజ్యం ప్రతిపాదనకు అనుకూలంగా

హస్రత్‌ మోహాని

భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లింలు.pdf

మౌలానా చేసిన ప్రసంగం గాంధీజిని కూడా కలవ రానికి గురిచేసింది. ఈ విషయాన్ని గాంధీజి తన ఆత్మకధలో ప్రత్యేంగా రాసుకున్నారు. 'ఆయన ప్రసంగం సబికు లను బాగా ఆకట్టుకుంది. నావాదన ఆరణ్యరోదన కాగలదని భయపడ్డాను. నాకు నేను ధైర్యం కూడగట్టుకుని..మాట్లాడలిచాను' అన్నారు. (Hasrath Mohani’s speech had been received whit such loud acclamations that I was afraid that mine would only be a cry in wilderness. I had made bold to speak...’ (The Story of My Experiment with Truth, MK Gandhi, Page. 442)

1921 నుండి మౌలానా పోరాడుతున్నా 'సంపూర్ణ స్వరాజ్యం' ప్రతిపాదనను గాంధీజీ ఒత్తిడి వలన తీర్మానంగా కాంగ్రెస్‌ ఆమోదించక పోవటం, తన విప్లవాత్మక భావాల పట్ల తరచుగా వ్యక్తమవుతున్నవ్యతిరేకత వలన విసిగిన ఆయన 1928లో కాంగ్రెస్‌ నుండి బయటకు వచ్చారు. 1929 అక్టోబరు 31 నాటిలాహోర్‌ సమావేశంలో మౌలానా కల పూర్తిగా నిజమైంది. సంపూర్ణ స్వరాజ్యం ప్రతిపాదన తీర్మానంగా రూపుదిద్దుకుంది.

మౌలానా హస్రత్‌ మోహాని వాదనా పటిమ గురించి టర్కీకి చెందిన రచయిత్రి Halide Eidb తో 1937 లో మహాత్మాగాంధీ మాట్లాడుతూ ..when I have a talk with Mohani, I can not sleep in peace..' అన్నారంటే మౌలానా వాదన ఏ స్థాయిలో ఉండేదో, అది మహాత్ముడ్ని ఏ మేరకు డిస్ట్రబ్‌ చేసేందో, మరేమేరకు ప్రభావితం చేసేందో ఊహించవచ్చు.

మలబార్‌ మోఫ్లాల విజృంభణ

బ్రిటిష్‌ పాలకులకు తొత్తులుగా వ్యవహరిస్తూ ప్రజలను, రైతాంగాన్ని పీడిస్తూన్న జమీందారుల అకృత్యాలను,1800 నుండి సాయుధులై ఎదుర్కొంటూ, ఆత్మ త్యాగాలకు సిద్ధ్దపడిన సుదీర్గ… చరిత్రగల కేరళ రాష్ట్రంలోని మలబారు మోప్లాలు, ఖిలాఫత్‌- సహాయ

43